ఎన్టీఆర్ కోరారు… త్రివిక్రమ్ చేశారు..!

NTR Trivikram srinivas movieఎన్టీఆర్ చేసిన ‘జనతా గ్యారేజ్’ .. ‘ జై లవ కుశ’ సినిమాలు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవే. ఆ సినిమాలు విభిన్న ఫలితాలను చవిచూడగా, అదే తరహాలో మరో సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తిని చూపలేదట. ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చే కథను చేయాలని నిర్ణయించుకున్న తారక్, తనని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ చేసే విధంగా కథను సిద్ధం చేయమని త్రివిక్రమ్ ను కోరినట్లుగా టాలీవుడ్ ట్రేడ్ వర్గాల టాక్.

ADVERTISEMENT

తనకి గల మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకోకుండా, త్రివిక్రమ్ మార్క్ సినిమానే చేయమని సూచించారట. అందుకు తగిన విధంగానే త్రివిక్రమ్ యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని బ్యాలెన్స్ చేస్తూ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా పూర్తి స్థాయి త్రివిక్రమ్ మార్క్ ను ప్రతిబింబిస్తూ అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండనుందని తెలుస్తోంది. అంటే త్రివిక్రమ్ మార్క్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్నాడన్నమాట.

ADVERTISEMENT
Latest Stories