చిరంజీవి ఆలస్యంగానైన గుర్తొచ్చారు మంచిది

Oommen Chandy about chiranjeeviఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను అంతా మర్చిపోయారు. నాయకులు కొందరు వేరే పార్టీలలో చేరిపోతే కొందరు రాజకీయాలకే దూరమైపోయారు. ఆ పార్టీ అధిష్టానం కూడా దిద్దుబాటు చర్యలు ఏమీ తీసుకున్నట్టుగా కనిపించలేదు. మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. అయితే ఎందుకనో గానీ ఉన్నట్టుండి ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్‌ చాందీ మీడియా ముందుకు వచ్చారు.

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని ఆయన ఎవరు అడగకుండానే చెప్పుకొచ్చారు. ఏపీలో చాలా మంది నేతలు కాంగ్రెస్ తోనే ఉన్నారని… సమావేశాలకు కూడా హాజరు అవుతున్నారని చెప్పుకొచ్చారు ఆయన. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ లో మిగిలిన అంతో ఇంతో చరిష్మా కలిగిన నేత చిరంజీవి.

ADVERTISEMENT

ఆయన పార్టీకి దూరం అవుతున్నప్పుడు పార్టీ హై కమాండ్ ఆయనతో మాట్లాడి పార్టీలో ఆక్టివ్ గా ఉంచే ప్రయత్నం చెయ్యలేదు. కనీసం 2019 ఎన్నికల సమయంలో కూడా ఆయన వద్దకు వెళ్ళలేదు. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తరువాత పార్టీలో చిరంజీవి యాక్టీవ్ గా లేరని గుర్తించారు. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టు ఉంది.

ఇక పోతే … పెట్రోల్‌ ధరలపై నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ స్థాయిలో నిర్ణయించారని, జూలై 7 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతుందన్నారు ఉమెన్‌ చాందీ. ధరల భారంపై జిల్లాల్లో సైకిల్ యాత్రలు చేస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని, బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. హోదా విషయంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉమెన్‌ చాందీ విమర్శించారు.

ADVERTISEMENT
Latest Stories