
నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. వాటిలో ప్రముఖ తెలుగు సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న బాలయ్యకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ప్రకటించడం అభిమానులకు, టీడీపీ శ్రేణులకు చాలా సంతోషం కలిగిస్తుంది.
Also Read – ట్రంప్-మోడీ భేటీ ఎవరిది పైచేయి?
మొత్తం 139 పద్మ అవార్డులలో 133 పద్మశ్రీ, 19 పద్మ భూషణ్, 7 పద్మశ్రీ అవార్డులున్నాయి. తెలంగాణ నుంచి ఇద్దరికీ, ఏపీ నుంచి ఐదుగురికీ ఈ అవార్డులు లభించాయి.
విదేశాలలో స్థిరపడిన కొందరు ప్రముఖ ప్రవాస భారతీయులకు, కొందరు విదేశీయులకు, చనిపోయిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులు ప్రకటించింది.
Also Read – కథ నచ్చితే ‘అమ్మ’ అయినా ‘అమ్మమ్మ’యినా ఒకే..
మాదిగల హక్కుల కోసం దశాబ్ధాలుగా పోరాడుతున్న మంద కృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, ప్రముఖ సినీ నటులు అజిత్ కుమార్, శోభన, కన్నడ నటుడు అనంత నాగ్ అశ్విన్, మరాఠీ సినీ దర్శకుడు శేఖర్ కపూర్ పద్మ భూషణ్ అవార్డులు, దివంగత గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ మరికొందరికి పద్మభూషణ్ అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
బాలయ్యకు ఈ అవార్డు ప్రకటించగానే అయితే స్వర్గీయ నందమూరి తారకరామారావుకు భారతరత్న అవార్డు ఎప్పుడొస్తుందో? అనే ఆలోచన తెలుగు ప్రజలకు కలగడం సహజం.
Also Read – రాహుల్ “లీగల్లీ కన్వెర్టడ్ ఇండియన్”.?
ఇంతమంది ప్రతిభని, సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల అభిమాన నటుడు, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుకు భారత రత్న అవార్డు ఇంకా ఎప్పుడు ఇస్తుంది?
విదేశీయులకు సైతం పద్మ అవార్డులు ఇస్తున్నప్పుడు తెలుగుజాతికి గర్వకారణమైన స్వర్గీయ నందమూరి తారకరామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కించడం దేనికి?
ఇప్పుడు ఎన్డీఏలో సిఎం చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నందున లేదా ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర బీజేపి అధ్యక్షురాలుగా ఉన్నారు కనుక వారు లాబీయింగ్ చేస్తేనే భారతరత్న అవార్డు కోసం ఇవ్వాలనో లేదా బీజేపి రాజకీయ అవసరాలు, లెక్కలు, కారణాలు ఉంటేనే ఇవ్వాలనో అని అనుకోకుండా సినీ, రాజకీయ రంగాలలో ఆయన అసాధారణ ప్రతిభని, సేవలను గుర్తించి ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తే ఎంతో హుందాగా ఉంటుంది కదా?