హైదరాబాద్ ను తాకిన ‘పద్మావత్’ సెగ!

Padmavati ban-సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమా అనేక వివాదాల నడుమ ఈ నెల 25వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను విడుదల చేయకూడదంటూ ఉత్తరాదిలో రాజ్ పుత్ లు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా ఈ సెగ తెలంగాణ రాష్ట్రానికి కూడా పాకింది. తెలంగాణలో సినిమా విడుదలను ఆపేయాలని రాజ్ పుత్ క్రాంతిసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్ డిమాండ్ చేశారు.

ADVERTISEMENT

హైదరాబాద్ ఆగాపురలోని మహారాణాప్రతాప్ విగ్రహం వద్ద ఆదివారం నాడు ధర్నా చేపట్టారు. సినిమా విడుదలైతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మరోవైపు, నగరంలోని టివోలి సినిమా థియేటర్ వద్ద రాజస్థాన్ కు చెందిన దాదాపు 50 మంది రాజ్ పుత్ యువకులు ఆందోళన చేపట్టారు. సినిమాకు, దర్శకనిర్మాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ADVERTISEMENT
Latest Stories