వైఎస్ షర్మిల ఏపీకి రావడం ఖాయమే: పళ్లంరాజు

Pallam-Raju-Sharmila

సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరడం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ అధిష్టానం ఏపీకి చెందిన మా అందరినీ వైఎస్ షర్మిల గురించి అభిప్రాయం అడిగినప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్‌లో చేరితే ఖచ్చితంగా పార్టీకి మేలు కలుగుతుందని ఏకగ్రీవంగా చెప్పాము. ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కనుక ఏపీ ప్రజలు ఆమెను తప్పక ఆదరిస్తారని చెప్పాము,” అని అన్నారు.

ఏపీలో కాంగ్రెస్‌ మళ్ళీ కోలుకోగలదా?అనే ప్రశ్నకు సమాధానమిస్తూ “తెలంగాణ ఏవిదంగా అయితే కాంగ్రెస్‌ కలిసికట్టుగా పనిచేసి అధికారంలోకి రాగలిగిందో అదే విదంగా ఏపీలో కూడా కృషి చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పాము. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్‌ ఒక్కటే నేటికీ కట్టుబడి ఉంది. కనుక ఇది కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశామని మా అధిష్టానానికి వివరించాము,” అని చెప్పారు.

ADVERTISEMENT

ఏపీలో పొత్తుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ,”మా అధిష్టానంతో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఏపీ కాంగ్రెస్‌ పరిస్థితి, వైఎస్ షర్మిల చేరిక గురించి మాత్రమే చర్చించాము. ఏపీలో పొత్తుల గురించి చర్చించలేదు. కానీ ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎంలు భాగస్వాములుగా ఉన్నందున ఏపీలో కూడా వాటితో మా పొత్తులు కొనసాగుతాయి. ఒకవేళ ఏపీలో వేరే పార్టీలేవైనా మాతో కలిసి పనిచేయాలనుకొంటే అందుకు మా పార్టీ సిద్దంగానే ఉంది,” అని పళ్లంరాజు చెప్పారు.

కనుక కాంగ్రెస్‌ అధిష్టానం వైఎస్ షర్మిలని ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు అప్పజెప్పడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆమెకు కూడా వేరే దారి లేదు. పైగా ఏపీలో సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ఆమె నాయకత్వాన్ని అంగీకరించి అండగా నిలబడేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. కనుక ఆమెకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. కనుక వైఎస్ షర్మిల ఏపీకి రావడం, జగనన్న సంధించిన బాణాన్ని తిరిగి ఆయనపైకే ప్రయోగించడం ఖాయంగానే కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories