Pastor Praveen Death

పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి సమీపంలో రోడ్ ప్రమాదంలో మరణించినప్పుడు శవరాజకీయాలు ఏవిదంగా జరిగాయో అందరూ చూశారు. ఆయన పాస్టర్ కనుక మత రాజకీయాలు కూడా జరిగాయి.

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శాంతి భద్రతలు అదుపు తప్పకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోయినా, విచారణ విషయంలో పోలీసులు కాస్త అలసత్వం ప్రదర్శించినా బహుశః రాష్ట్రంలో పరిస్థితులు నేడు మరోలా ఉండేవేమో?

Also Read – అభివృద్ధి కంటే వినాశనానికే మద్దతెక్కువా..?

ఈ ప్రమాదంపై జగన్‌ మేనత్త విమలారెడ్డి చెప్పిన హితోక్తులు ఎవరూ చెవికి ఎక్కించుకోలేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య, సోదరుడు చేసిన విజ్ఞప్తిని ఎవరూ చెవికెక్కించుకోలేదు. పోలీసులు అది రోడ్ ప్రమాదమని చెపుతున్నా వినిపించుకోకుండా శవ, మత రాజకీయాలు చేశారు.

ఇది చాలా సున్నితమైన కేసు కనుకనే పోస్టు మార్టం రిపోర్ట్ కోసం ఎవరు ఎంత యాగీ చేసినా, ఫోరెన్సిక్ నివేదిక కూడా చేతికి వచ్చే వరకు బయటపెట్టలేదు.

Also Read – ఒక్క ఫోన్‌కాల్‌తో వందకోట్లు అప్పు.. దటీజ్ విజయసాయి రెడ్డి!

ఫోరెన్సిక్ నివేదికలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం సేవించారని ధృవీకరించింది. సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రి వరకు గల సీసీ కెమెరా రికార్డింగులన్నీ పరిశీలించడం మామూలు విషయం కాదు. కానీ పరిశీలించిన తర్వాత ఆయన సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రి చేరుకునేలోగా మూడుసార్లు చిన్న చిన్న ప్రమాదాలకు గురయ్యారని, ఆ ప్రమాదాలలో బైక్‌ హెడ్‌ లైట్ పగిలిపోవడంతో సైడ్ బ్లింకర్స్ వేసుకొని బండి నడిపించారని ఈ కేసు దర్యాప్తు చేసిన ఐజీ అశోక్ తెలిపారు.

మద్యం మత్తులో బండి నడిపించినప్పుడు అదుపు చేయలేక రాజమండ్రి సమీపంలో రోడ్ ప్రమాదంలో మరణించారని ఐజీ అశోక్ తెలిపారు. ఈ కేసుకి సంబందించి పూర్తి సాక్ష్యాధారాలు మీడియాకు వెల్లడించారు.

Also Read – భగవద్గీతని సూర్య చంద్రులని ఎవరో గుర్తించాలా?

ఈ ప్రమాదంపై జగన్‌ మేనత్త విమలారెడ్డి స్పందిస్తూ, “క్రైస్తవుల జీవితాలలో ఏమి జరిగినప్పటికీ అది ఆ భగవంతుడి ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది తప్ప వేరేగా జరుగదని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కనుక ఈ ఘటనపై మాట్లాడటం అంటే ఆయన నిర్ణయాన్ని మనం ప్రశ్నిస్తున్నట్లే అవుతుంది,” అని చెప్పారు.




కానీ క్రీస్టియన్లకు తానే పెద్ద దిక్కునని భావించే కేఏ పాల్ ఆమె మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తించడాన్ని ఏమనుకోవాలి?అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంతో శవ, మత రాజకీయాలు చేయాలనుకున్న వారు ఇప్పుడేమి సమాధానం చెపుతారు?