పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఫస్ట్ లుక్’ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియనిది కాదు. ఇదిగో, అదిగో అంటూ వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను, త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7వ తేదీన ఖచ్చితంగా విడుదల చేస్తారని అనుకుంటున్న తరుణంలో… అభిమానులకు మరోసారి చేదు అనుభవం తప్పకపోవచ్చనే సమాచారం అందుతోంది.
త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా కేవలం టైటిల్ లోగోను మాత్రమే విడుదల చేస్తారని, ఫస్ట్ లుక్ ను గానీ, ఫస్ట్ టీజర్ గానీ అభిమానులను పలకరించబోవడం లేదని ఖచ్చితమైన సమాచారం రావడంతో, ఫ్యాన్స్ అనుకుంటున్నట్లుగా ఏ విధమైన పోస్టర్ విడుదల కావడం లేదు. దీంతో ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ మరియు టీజర్ కు మరో ముహూర్తాన్ని చిత్ర యూనిట్ ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అప్పటివరకు పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరీక్షించాల్సిందే!