చంద్రబాబు ఇల్లు ఎక్కడ కడుతున్నారు పవన్ కళ్యాణ్?

Pawan Kalyan allegations on chandrababu naidu house constructionజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజురోజుకు టీడీపీ ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచుతున్నారు. చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ఆయన అన్నారు. ఇవాళ విజయనగరంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం 34 సార్లు మాట మార్చిందని ఆయన అన్నారు.

టీడీపీకీ మద్దతు ఇస్తే తాను మంచోణ్ని అని పొగిడిన ఆ పార్టీ నేతలు.. ఇప్పడు నిలదీస్తున్నందున బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నానంటూ విమర్శస్తున్నారని అన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి పర్యావరణ అనుమతులు లేవని, నిబంధనలు అతిక్రమించి భవంతులు కట్టేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. అసలు ఒక ఇంటికి పర్యావరణ అనుమతులు ఉండటం ఏంటి?

ADVERTISEMENT

అసలు అమరావతిలో ముఖ్యమంత్రి ఇల్లు ఏమి కట్టడం లేదు. ప్రభుత్వానికి పూలింగ్ లో ఇచ్చిన ఒక ఇంటిలో ఆయన తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. కృష్ణా నది కరకట్ట మీద అక్రమంగా కట్టిన ఆ ఇంటిని రాజధాని నిర్మాణంలో భాగంగా సరైన సమయంలో నెల మట్టం చేస్తారు. ఈ ఇంట్లో చంద్రబాబు దాదాపుగా మూడేళ్ళ నుండి ఉంటున్నారు. మరి సడన్ గా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందో పవన్ కళ్యాణ్ కు.

ADVERTISEMENT
Latest Stories