పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ‘స్వరాజ్యయాత్ర’?

Pawan Kalyan Bus Yatraజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రాల్లోని 13 జిల్లాలను చుడుతూ చేపట్టనున్న బస్సు యాత్ర ఈ నెల 15న మొదలయ్యే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర కు స్వరాజ్యయాత్ర అని పేరు అనుకుంటున్నట్టు సమాచారం. ఈరోజో రేపో పార్టీ నుండి అధికారిక ప్రకటన రావొచ్చు.

మొదటి విడతగా 40 రోజులపాటు స్వల్ప విరామాలతో యాత్ర సాగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం అయినట్టు సమాచారం. సాధారణ ఎన్నికలకు కేవలం ఒక ఏడాది మాత్రమే ఉండడంతో పవన్ కళ్యాణ్ ప్రజలలో విస్తృతంగా పర్యటించాలని అనుకుంటున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

తాజాగా ఎవరితో పొత్తులు ఉండవన్న సంకేతం ఇవ్వడమే కాకుండా 175 సీట్లకు జనసేన పోటీచేస్తుందని, అందుకు తగిన విధంగా పార్టీని నిర్మిస్తామని పవన్ ప్రకటించారు. మరోవైపు ఇప్పటినుండే అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారంట జనసేనాని. తొందర్లో ఆ పని పూర్తి చేసి అభ్యర్థులకు నియోజకవర్గాలలో పని చేసుకోవడానికి తగిన టైం ఇవ్వాలని పవన్ అభిప్రాయమట

ADVERTISEMENT
Latest Stories