జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్‌లో ఒకే ఒక్క ప్రెస్‌మీట్‌తో అన్ని పార్టీలకు, అందరు నేతలకు, అన్ని విమర్శలకు ఘాటుగా, ధీటుగా సమాధానాలు ఇచ్చి పడేశారు.
సిఎం రేవంత్ రెడ్డిపై నాకు చాలా గౌరవం ఉందంటూనే కాంగ్రెస్ నేతల ప్రాంతీయవాదాన్ని ఎండగట్టేశారు. జాతీయపార్టీగా చెప్పుకునే మీ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ద్వంద వైఖరి సరైనదేనా?జవాబు చెప్పాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి సూటిగా ప్రశ్నించారు.
ఇంకా చాలా సూటి ప్రశ్నలు వేశారు. విమర్శలు గుప్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లన, కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ, నగరంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి నిరాకరించినందునే.
తెలంగాణ సాధన కోసం ప్రాంతీయవాదం భుజానికి ఎత్తుకున్న బీఆర్ఎస్ పార్టీ, పన్నెండేళ్ళ తర్వాత కూడా ఆ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ది పొందుతోందని, కానీ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి నేటికీ దయనీయంగా ఉందని పవన్ కళ్యాణ్ చాలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఆంధ్రా కాంట్రాక్టర్లతో పనులు చేయించుకుంటూ వారి నుంచి కమీషన్లు తీసుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు అభ్యంతరం లేదు కానీ ఆంధ్రావాళ్ళు అంటూ విషం కక్కుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకా ఎంత కాలం ఈ ప్రాంతీయవాదం పేరుతో రాజకీయాలు చేస్తారు? అని ధైర్యంగా నిలదీశారు.
తెలంగాణ కూడా భారత్‌లో అంతర్భాగమేనని, తెలంగాణ పట్ల నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయని పదేపదే చెప్పాలా? నిరూపించుకోవాలా?
బరాబర్ తెలంగాణలో తిరుగుతా… వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుంది. ఎవడ్రా మమ్మల్ని ఆపేది? తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ కళ్యాణ్ విసిరిన సవాలు తెలంగాణవాదం, ప్రాంతీయవాదం పేరుతో రాజకీయాలు చేస్తున్నవారు జీర్ణించుకోవడం చాలా కష్టమే. కనుక వారి రియాక్షన్ అంతకంటే ఘాటుగానే ఉండవచ్చు.
పెద్ది హుక్ షాట్ కొట్టినట్లు పవన్ కళ్యాణ్ బరిలో దిగుతూనే ఇలా దంచి పడేయడంతో ఇంతకాలం అయోమయస్థితిలో ఉన్న జనసేన-తెలంగాణ శ్రేణులు ఉత్సాహంతో పొంగిపోతున్నాయి.
కనుక ఇకపై తెలంగాణపై సర్వ హక్కులు మావే అనుకుంటున్నవారికీ, జనసేనకు మద్య యుద్ధాలు తప్పవు. కనుక ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ వారి వెనుక నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీ ప్రభుత్వంలో క్షణం తీరిక లేని బాధ్యతలు నిర్వహిస్తునందున, జనసేన తెలంగాణని పట్టించుకోకపోతే అక్కడి దేశముదురు పార్టీలు వారితో ఫుట్ బాల్ ఆడేసుకుంటాయి.
పవన్ కళ్యాణ్ తెలంగాణ పార్టీలకు రెండు మూడు నెలలకు సరిపడే రాజకీయ ఆహారం అందించారు కనుక ఇకపై వారితో ఏపీ ప్రభుత్వానికి, సిఎం చంద్రబాబు నాయుడుకి కూడా తలనొప్పులు భరించక తప్పకపోవచ్చు.
తెలంగాణలో ఆంధ్ర వాళ్లకేం పని అంటారు… సరే, సంతోషం, కరెక్టే.
మరి తెలంగాణలో Andhra Contractors మాత్రం ఓకేనా ఇక్కడ?
అసెంబ్లీలో తీర్మానం చేయండి.
“పవన్ కళ్యాణ్‌కి తెలంగాణలో అనుమతి లేదు” అని, ఎలా పెడతారో నేనూ చూస్తా.#Telangana #PawanKalyan pic.twitter.com/Pbv4BOK1lr— M9 NEWS (@M9News_) June 2, 2026




