మెగాస్టార్ చిరంజీవి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… వీరిద్దరిని ఒకే ఫ్రేంలో చూడాలని మెగా అభిమానులు ఎప్పుడూ ఊవ్విళ్ళూరుతుంటారు. అయితే ఈ అవకాశం చాలా అరుదుగా లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన సమయంలో ఈ మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేంలో కనిపించి అభిమానులకు కన్నులవిందు చేసారు.
ఇటీవల ‘అజ్ఞాతవాసి’ సినిమా ఆడియో వేడుక సందర్భంగా కలుస్తారని భావించినప్పటికీ, అది సాధ్యం కాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందారు. అయితే గవర్నర్ ఇచ్చిన విందులో వీరిద్దరూ కనిపించడంతో, మీడియా కళ్ళు క్లిక్ మనిపించాయి. ఆ క్లిక్సే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్య రాజకీయ నేతలు హాజరైన ఈ విందులు మెగా ఫ్యాన్స్ కు మాత్రం ఈ ఒక్క ఫోటో సంథింగ్ స్పెషల్ గా నిలిచింది.
ADVERTISEMENT
ADVERTISEMENT





