ఆ పవన్ కళ్యాణ్ సినిమా పరిస్థితి ఏంటి?

Pawan Kalyan - Director Krishజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ముగింపుకు చేరుకుంది. అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా మొన్న ఆ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది.

ఇది ఒక పీరియడ్ సినిమా అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ బాగా లేట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో సంక్రాంతికి ఈ సినిమా విడుదల చెయ్యాలని ఆలోచన చేశారు. తాజాగా 2021 వేసవికి విడుదల చెయ్యాలని ఆలోచన చేస్తున్నారు.

ADVERTISEMENT

కరోనా పరిస్థితులు చక్కబడకపోతే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు బాలీవుడ్ నటులు… జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక హీరోయిన్ గా, అర్జున్ రాంపాల్ విలన్ గా ఫైనల్ అయినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కి ఇప్పటివరకూ బాలీవుడ్ మార్కెట్ లేదు.

ప్రత్యేకించి ఇద్దరు బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారు అంటే ఈ సినిమా ను పాన్-ఇండియా లెవెల్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పీరియడ్ సినిమాలకు భాషా బేధాలు ఉండవు అనే అంచనా కావొచ్చు. అయితే మొన్న ఈ మధ్య చిరంజీవి సైరాతో అటువంటి ప్రయత్నమే చేసి దెబ్బ తిన్నారు. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒకింత జాగ్రత్త గా ఉండాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories