Pawan Kalyan Eye Operation in LV Prasad Eye Hospitalకొంతకాలంగా కంటి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకోబోతున్నారని వార్తలు షికారు చేసాయి. అది పవన్ కళ్యాణ్ నిరాడంబరత్వానికి నిదర్శనం అని జనసైనికులు కూడా సంబరంగా ఆ వార్తను స్ప్రెడ్ చేశారు. అయితే దీంట్లో నిజం లేదని సమాచారం.

Also Read – ఎంపీపీ సీట్లు గెలుచుకున్నారు.. వెయ్యండి వీరతాళ్ళు!

స్వయంగా జనసేన పార్టీ దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ప్రసిద్ధ ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరగబోతున్నట్టు సమాచారం. జనసేన పార్టీ పంపిన ఒక ప్రెస్ నోట్ లో దీనిగురించి స్పష్టంగా ఉంది. మరోవైపు జనసేన పోరాటయాత్ర ఈ నెల 26నుండి తిరిగి ఆరంభం కాబోతుంది.




విశాఖపట్నంలోని మిగిలిన చోట్ల యాత్ర పూర్తయ్యాక ఆయన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. మొత్తం రాష్ట్రమంతా చుట్టాలని జనసేనాని ఆలోచనగా ఉంది. తద్వారా ఆయన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్లాలని ఆయన ఉద్దేశం.

Also Read – సహకార టాక్సీ: రాపిడో, ఓలా కు చెక్ పెడుతుందా.?