పవన్ కళ్యాణ్ పై గవర్నర్ కు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమిటి?

Pawan-Kalyan---Governer-ESL-Narasimhanఇటీవలే కాలంలో గవర్నర్ అధ్వర్యంలో జరుగుతున్న అన్ని అధికారిక కార్యక్రమాలలోను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపిస్తూనే ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఆహ్వానం పంపవలసిన అవసరం లేకపోయినా గవర్నర్ ఆయనను మిస్ చెయ్యడం లేదు. ఇటీవలే కాలంలో పవన్ కళ్యాణ్ కేంద్రంపై పలు విషయాలలో వేలెత్తి చూపుతున్నారు.

గవర్నర్ కేంద్రం ప్రతినిధి అని అందరికి తెలిసిందే. యూపీఏ అపాయింట్ చేసిన గవర్నర్ అయినా బీజేపీ ఆయనను కొనసాగిస్తోంది అంటే కేంద్రంతో ఆయనకు ఉన్న సంబంధాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటిది బీజేపీతో పొత్తు లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ కు ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్ధం కానిది.

ADVERTISEMENT

బహుశా పవన్ కళ్యాణ్ బీజేపీ మధ్య గవర్నర్ మధ్యవర్తిత్వం చేస్తున్నారా అనే అనుమానం కలగక మానదు. టీడీపీతో తెగతెంపులు చేసుకుంటే బీజేపీ జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇంటరెస్ట్ చూపించవచ్చు. అయితే ఆంధ్ర ప్రదేశ్ కు చేసిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చని బీజేపీతో పవన్ కళ్యాణ్ వెళ్తే అది ఆత్మహత్యసదృశ్యమే అనుకోవాలి.

పవన్ కళ్యాణ్ ముందుకు వస్తే మాత్రం టీడీపీతో పొత్తు వదులుకునే సాహసం చెయ్యవచ్చు. అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పని చేస్తున్నారనే అనుకుంటున్నారు. 2019 లెక్కలు చాలా ఇంటరెస్టింగ్ గా ఉండబోతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories