తెలంగాణలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. కానీ తొలకరి జల్లులు మొదలవడంతో బయట వాతావరణం చల్లబడింది.
రెండు వారాల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ తర్వాత వేడెక్కిన రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా చల్లబడినట్లే ఉంది.
అయితే అటువంటి రాజకీయాలను ప్రజలు, ముఖ్యంగా అభిమానులు లైట్ తీసుకుంటారని నేడు పవన్ కళ్యాణ్ హనుమకొండ పర్యటనతో స్పష్టమైంది.
హనుమకొండకు చెందిన నిరంజన్ (17) ఏళ్ళ బాలుడు అరుదైన జన్యుపరమైన డీఎండీ వ్యాధితో బాధపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైన అతను ఎప్పటికైనా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి కలవాలని ఆరాటపడ్డాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నేడు హనుమకొండ వచ్చినప్పుడు దారి పొడవునా అభిమానులు, ప్రజలు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆయన కూడా వారికి అభివాదం చేస్తూ నిరంజన్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. “నేను ఓజీ-2 చేసినట్లయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి నువ్వే నా చీఫ్ గెస్ట్..” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆ బాలుడు పొంగిపోయాడు. అతనితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాజకీయాలు ప్రాంతాలను, మనుషులను కలపాలే తప్ప విడగొట్టడానికి కాదు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెపుతూనే ఉన్నారు. అదే నిరూపించి చూపారు. తెలంగాణ ప్రజలు కూడా అదే స్పూర్తి కనపరిచారు. కానీ తెలంగాణవాదం పేరుతో రాజకీయ మనుగడ సాగిస్తున్న కొన్ని పార్టీలు, నేతలకు ఇదే జీర్ణించుకోవడం కష్టమే. కానీ పవన్ కళ్యాణ్ హనుమకొండ పర్యటనపై రాజకీయాలు చేయకుండా సంయమనం పాటించినందుకు అభినందించాల్సిందే.
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was… pic.twitter.com/jI7VZ9y0kC
— Pawan Kalyan (@PawanKalyan) June 17, 2026




