‘జనసేన’ రివర్స్ ఎటాక్ ఇస్తోందిగా!

Pawan-Kalyan-Jana-Sena-Allaince-with-CPMటీటీడీ ఈవో ఎంపిక వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ‘ఉత్తరాది – దక్షిణాది’ బేధాలపై విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. రాజకీయ విమర్శలకు తోడు ఐఏఎస్ సంఘం వారు కూడా పవన్ అభిప్రాయాలను నిందిస్తూ అధికారిక ప్రకటనలు గుప్పించారు. దేశంలో ఎక్కడైనా తాము నిర్వహించే హక్కు ఉందని, అలాంటి పాత్రలో తాము ఉన్నాము, దేశ శ్రేయస్సే తమకు ముఖ్యం అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో పార్టీ పరంగా జనసేన రివర్స్ ఎటాక్ ఇస్తోంది.

అసలు హాట్ టాపిక్ అయిన టీటీడీ ఈవో అంశాన్ని పక్కనపెట్టి, తమ అధినేత వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, టీటీడీ ఈవోగా ఉత్తరాది వారిని నియమించడం పట్ల తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఇదే రీతిన అమరనాధ్, మధుర, వారణాసి వారి పుణ్యక్షేత్రాలకు కూడా దక్షిణాది రాష్ట్రాల వారిని నియమించాలన్న డిమాండ్ ను పవన్ చేసారని, దీనిని ఎలా తప్పని అంటారని ‘జనసేన’ ఉపాధ్యక్షుడు మహేంద్ర రెడ్డి ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.

ADVERTISEMENT

అంటే ఇంతకుముందు మాదిరి విమర్శలు వస్తుంటే… వేచిచూసే ధోరణికి ‘జనసేన’ స్వస్తి పలికినట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ‘ఉత్తరాది – దక్షిణాది’ అంటూ పదే పదే ప్రశ్నిస్తున్న పవన్ పై విమర్శలు రావడంతో పార్టీ పరంగా మరోసారి స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ వివరణ ఎలా ఉందంటే… రాజు గారి మొదటి భార్య మంచిది అంటే… రెండవ భార్య గురించి కామెంట్ చేసినట్లా… కాదా..! ఉత్తరాదిలో దక్షిణాది వాళ్ళ నియామకం చోటు చేసుకోనపుడు, దక్షిణాదిలో ఉత్తరాది వారిని నియమించడం సరైనది కాదనేగా ‘జనసేన’ భావన..!

ADVERTISEMENT
Latest Stories