పవన్ కళ్యాణ్ కు వేరేగా శత్రువులు అక్కర్లేదు… అభిమానులు చాలు

pawan-kalyan-jana-sena-defeat-reviewసినిమాలు వదిలి రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు బలమైన బలగమైన అభిమానులే. అయితే ఆ అభిమానులే చాలా సందర్భాలలో ఆయనకు భారంగా పరిణమిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ ట్విట్టర్ లో జరిగింది. జనసేనకు కేవలం ఒక్కే ఒక్క సీటు తన ఖాతాను తెరిచింది. తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు.

ఇది జనసైనికులకు జీర్ణించుకునే విషయంలా లేదు. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అది కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడం వారు ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు. ట్విట్టర్ లో ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించి పార్టీనీ, పవన్ కళ్యాణ్ ను కూడా చులకన చేసాడు. సదరు అభిమాని రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఉపఎన్నికలు వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని దేవుడిని కోరుకున్నట్టు రాశాడు. తెలిసిరాసాడో తెలియకరాసాడో గానీ ఇప్పుడు ట్విట్టర్ లో ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.

ADVERTISEMENT

ఇతర పార్టీ అభిమానాలు జనసేనను గేలి చేస్తున్నారు. మీ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరో ఒక ఎమ్మెల్యే చనిపోవాలని కోరుకుంటున్నావా అంటూ ఆ సదరు అభిమాని పై విరుచుకుపడుతున్నారు. జనసేన అభిమానుల కుసంస్కారం ఇది అంటూ ఆ ట్వీట్ ను మొత్తం అభిమానులకు ఆపాదించేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవాడ వచ్చారు. ఎన్నికల ఓటమి తరువాత మొట్టమొదటి సమీక్ష నిర్వహించారు.

ADVERTISEMENT
Latest Stories