కాపు రాజకీయం పని చెయ్యలేదా?

Janasena-Supporters-Striking-Wrong-Chordsఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు పని చేయలేదు. కేవలము కులము పేరు చెప్పుకొని కొన్ని జిల్లాల్లో ఓట్లు అడిగి, కింగ్ మేకర్ లు అవుదామని భావించిన పవన్ కళ్యాణ్ వంటి వారిని నమ్మలేదు. అలాగే కాపు కార్పొరేషన్, రిజర్వేషన్ వంటి ప్రయత్నాలతో కాపులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన టీడీపీని పక్కన పెట్టారు ఆ సామాజికవర్గం వారు. కుల రాజకీయం కాకుండా సహజంగా ఎన్నికల వేళ అందరిలో ఉండే మూడ్ బట్టే తమ నిర్ణయం తీసుకున్నారు.

దీనితో ఉభయ గోదావరి జిల్లాలలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయదుంధుబి మోగించింది. పవన్ కళ్యాణ్ తనని తాను కులరహితం అని చెప్పుకున్నారు, నాది రెల్లి కులం అన్నారు. అయితే కాపులు ఎక్కువగా ఉండే జిల్లాలలోనే ఎక్కువ ఫోకస్ చెయ్యడం, వారు నిర్ణయాత్మక స్థితిలో ఉండే నియోజకవర్గాలలోనే తానూ, తన సోదరుడు నాగబాబు పోటీ చెయ్యడం ద్వారా తన మాటలకు చేతలకు పొంతన లేదు అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. అభిమానులు ఒప్పుకోకపోవచ్చు కాకపోతే ప్రజలలోకి వెళ్లిన మెస్సేజ్ అయితే ఇదే.

ADVERTISEMENT

అప్పట్లో చిరంజీవి కూడా ఇదే చేశారు. అయితే అప్పుడు ఆయనకు 75 లక్షల ఓట్లు ఇచ్చిన ప్రజలు ఈ సారి జనసేనకు కేవలం 16.76 లక్షల ఓట్లు (5.35% ఓట్ షేర్). ఆ పార్టీ పోటీ చేసిన 137 సీట్లలో 121 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. కాపులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో తమకు సంస్థాగతంగా మద్దతు ఇచ్చిన బీసీల ఓట్లుకూడా పోగొట్టుకుంది టీడీపీ. మొత్తానికి చాలా కాలం తరువాత ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు పని చెయ్యకపోవడం శుభపరిణామం.

ADVERTISEMENT
Latest Stories