ఆ విషయంలో పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడే

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో ఆ పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో గ్లాసు గుర్తు ఫొటో షేర్ చేసి తమ కామెంట్లు జత చేస్తున్నారు. పనిలో పనిగా మరికొందరు పవన్ కల్యాణ్‌ వివిధ సందర్భాల్లో గాజు గ్లాసులో టీ తాగుతున్న ఫొటోలను ఉంచారు. చిరంజీవి నటించిన మృగరాజు సినిమాలోని ‘ఛాయ్‌ చటుక్కున తాగరా భాయ్’ వీడియోను, ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

‘సామాన్యుడి నుంచి సంపన్నుల వరకూ అందరి దాహం తీర్చే గ్లాస్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికలలో కొత్త పార్టీ అయిన కోదండరామ్ కు చెందిన తెలంగాణ జన సమితికి చివరి నిముషంలో అగ్గిపెట్టె గుర్తుని కేటాయించింది ఎన్నికల సంఘం. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల అయ్యాక కామన్ సింబల్ ఇవ్వడంతో చివరి నిముషంలో పార్టీ సింబల్ ను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో ఇబ్బంది పడ్డారు. ఎన్నికలలో పోటీ చేసిన ఎనిమిది సీట్లలో ఖాతా కూడా ఓపెన్ చెయ్యలేదు ఆ పార్టీ.

ఏడు సీట్లలో డిపాసిట్లు కోల్పోయింది. కోదండరామ్ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉండగా ఇది కూడా ఒక కారణం. ఎన్నికలకు దాదాపుగా నాలుగైదు నెలల ముందుగా గుర్తు రావడంతో సింబల్ ను ప్రజలలోనికి తీసుకువెళ్ళడానికి జనసేన పార్టీకి కావాల్సినంత సమయం దొరికింది. పార్టీ గుర్తు లేదని ఇన్నాళ్లూ బాధ పడుతున్న జనసైనికులు.. ఇప్పుడు గుర్తు కేటాయింపుతో నేరుగా కార్యాచరణలోకి దిగారు. గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతుగా సోషల్ మీడియా వేదికగా ప్రయత్నాలు ప్రారంభించారు.

పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ హాలిడే కోసం యూరప్ లో ఉండగా ఈ కీలక ప్రకటన వచ్చింది. ఈరోజు ఆయన దీనిపై ట్విటర్ లో స్పందించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు ఇప్పటికే గాజు గ్లాసు తో ఉన్న పవన్ కళ్యాణ్ బ్యానెర్లు కట్టడం మొదలుపెట్టారు. ఆయన క్రిస్మస్ తరువాత తిరిగి వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ యూరప్ యాత్ర ముగించుకుని వచ్చాకా పూర్తి స్థాయిలో అమరావతిలో పార్టీ నాయకులకు పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటాను అని ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories