పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యేలనే కలుస్తున్నారు ఎందుకు?

Pawan Kalyan Meeting only tdp leadersవివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది రాయకీయ నాయకులను కూడా కలుస్తున్నారు ఆయన. శనివారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కలిశారు. ఆదివారం స్వయంగా మంత్రి పరిటాల సునీతా ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు.

అదేవిధంగా సాయంత్రం వైకాపా నుండి టీడీపీకు ఫిరాయించిన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాను కూడా కలిశారు. కాసేపటి క్రితం ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్య నారాయణను కలిశారు. స్థానిక సమస్యలను అర్ధం చేసుకోవడానికే ఈ భేటీలు అని చెప్తున్నాయి జనసేన వర్గాలు. అయితే వైకాపా మాత్రం ఈ భేటీలపై నిప్పులు చెరుగుతుంది.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏజెంట్ అని ఈ భేటీలు చెప్పకనే చెబుతున్నాయి అని వారు అంటున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేను కలవడమంటే అనైతిక ఫిరాయింపులని సమర్ధించడమే అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కలుస్తా అంటే మాత్రం జగన్ తమ ఎమ్మెల్యేలను కలవడానికి ఒప్పుకుంటారా?

ADVERTISEMENT
Latest Stories