మొన్నటివరకు ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, దానికి బ్రేక్ ఇచ్చి యుఎస్ పయనమైన విషయం తెలిసిందే. హార్వర్డ్ యూనివర్సిటీలో 11, 12 తేదీలలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్ళిన పవన్ కళ్యాణ్, హార్వర్డ్ ప్రొఫెసర్ స్టీవ్ జార్డింగ్ ను కలుసుకున్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
క్లాస్ కాస్ట్యూమ్స్ తో టక్ చేసుకుని ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పక్కా ప్రొఫెసర్ మాదిరి కనపడుతుండడం విశేషం. ‘కాటమరాయుడు’ పోస్టర్లు, టీజర్ లలో కూడా పవన్ ఇంత అందంగా కనపడలేదని చెప్పడంలో సందేహం లేదు. తెల్లటి డ్రెస్ లో మెరిసిపోతున్న పవన్ కళ్యాణ్ ను చూసి మురిసిపోవడం పవర్ స్టార్ అభిమానుల వంతవుతోంది. పార్టీ పరంగా ఈ పర్యటన ‘జనసేన’కు పెద్ద ప్లస్ అవుతుందని పొలిటికల్ వర్గాల టాక్.
ADVERTISEMENT
ADVERTISEMENT



