సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కత్తి మహేష్ చేసిన ఆరోపణల తర్వాత, అసలు కధ ప్రముఖ మీడియా ఛానల్ టీవీ9 స్టూడియోకు మారింది. అక్కడ నుండి నేరుగా టీవీ 9 స్టూడియోకు చేరుకున్న కత్తి మహేష్, తను వేసిన ప్రశ్నలకు ఆధారాలు పూనం కౌర్ వస్తే చూపిస్తానని స్పష్టం చేసారు. తను వేసిన ప్రతి ప్రశ్న వెనుక ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని చెప్పిన కత్తి మహేష్, దానికి సంబంధించిన అంశాలను క్లుప్తంగా తెలిపారు. ముఖ్యంగా పవన్ – త్రివిక్రమ్ లు కలిసి క్షుద్రపూజలు నిర్వహించారని చెప్పిన కత్తి, దానికి సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉందని స్పష్టం చేసారు. అందులో పవన్, త్రివిక్రమ్ లు స్పష్టంగా కనపడుతున్నారని తెలిపారు.
ఆ పూజలు నిర్వహించిన పూజారి నరసింగం పేరు కూడా చెప్పాను కదా… ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అని చెప్పగానే, సదరు మీడియా ఛానల్ కాసేపు బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత సమాచారాన్ని తెలిపింది. “జల్సా” సినిమా సమయంలో ద్వారకా తిరుమల, శ్రీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని, అది పవన్, త్రివిక్రమ్ లే కాదు, టాలీవుడ్ బడా స్టార్స్ మహేష్ బాబు వంటి ఇతర హీరోలు కూడా చేసారన్న సమాచారం తమ వద్ద ఉందని టీవీ9 ప్రతినిధి చెప్పారు. అయితే అర్ధరాత్రి సమయాలలో పూజలు చేయడం వలన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో, రాత్రి సమయాలలో ఒకవేళ పూజలు చేసి ఉంటారు గానీ, దానిని క్షుద్రపూజలు అనడం సమంజసమేనా? అని కత్తిని ప్రశ్నించారు.
ఒకవేళ మీరు చెప్పింది నిజమో కాదో తనకు తెలియదని, ఒకవేళ అది నిజమే అయినా అక్కడ పూనం కౌర్ ఉండాల్సిన ఆవశ్యకత ఏంటి? ఆమె ఎందుకు అక్కడ ఉంది? అన్నది ప్రశ్నగానే మిగిలిందని తెలిపారు. మొత్తానికి పవన్ – త్రివిక్రమ్ లు కలిసి క్షుద్రపూజలంటూ చేసిన సంచలన కామెంట్ పై ఓ క్లారిటీ వచ్చినట్లే చెప్పొచ్చు. బహుశా ఆ పూజలకు సంబంధించిన వీడియోనే కత్తి మహేష్ వద్ద ఉండి ఉండొచ్చు అన్న నమ్మకం బలపడుతోంది. అయితే అది ఒకసారి కాదని, రెండు, మూడు సార్లు ఇలాంటి పూజలు నిర్వహించినట్లుగా తన వద్ద సమాచారం ఉందని, కానీ వీడియో మాత్రం ఒక్కటే ఉందని కత్తి స్పష్టం చేసారు.





