సామ్‌, చైకి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నుండి వూహించని సర్‌ప్రైజ్‌!

Pawan Kalyan Trivikram Srinivas special gift to Samantha naga chaitanya!అక్టోబర్‌ 6న సమంత, నాగచైతన్య ఒకటయ్యారు. గోవాలో కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో హిందూ, క్రీస్టియన్ పద్దతుల్లో వీరిద్దరూ ఒకటయ్యారు. అయితే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ కొత్త జంటకి రెండు డైమండ్‌ ఉంగరాలను కానుకగా పంపినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ADVERTISEMENT

సరిగ్గా పెళ్లి సమయానికి బహుమతి అందేలా ప్లాన్‌ చేసి ప్రత్యేకంగా ఉంగరాలు డిజైన్‌ చేయించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి గిఫ్ట్‌ చూసి సామ్‌, చై ఎంతో సర్‌ప్రైజ్‌ అయ్యారట. ముందు హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న రిసెప్షన్‌లో వీటిని స్వయంగా ఆ జంటకు ఇవ్వాలని ప్లాన్ చేశారట.

ఐతే చివరి నిమిషంలో ప్లాన్ మార్చి డైరెక్ట్ గా పెళ్లి సమయానికే ఆ గిఫ్ట్ అందెల పంపారాట. సమంత.. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించారు. నితిన్ సమంత నటించిన అ..ఆ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే రూపుదిద్దుకుంది. ఐతే ఈ గిఫ్ట్ సంగతి ఇరువర్గాలు ఖరారు చెయ్య లేదు.

ADVERTISEMENT
Latest Stories