జగన్, పవన్ మోడీని మాట అననివ్వరా?

Pawan Kalyan -YS Jaganప్రత్యేక హోదా పేరుతో తిరుపతిలో ఈ నెల ముప్పైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపద్యంలో విశాఖపట్నంలో వంచన దినం పాటించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రప్రజల దృష్టి టీడీపీ సభపై పడకుండా ఈ సభ వైకాపా ప్రకటించిందని టీడీపీ ఆరోపణ.

పైగా ఆరోజున జగన్‌ తన పాదయాత్రను యథావిధిగా కొనసాగిస్తారట. దీనివల్ల జగన్ మోడీని విమర్శించాల్సిన అవసరం కూడా ఉండదు. 2014లో ఏప్రిల్ 30న తిరుపతిలోని ఒక ఎన్నికల సభలో నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తామని, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని ప్రమాణం చేసారు.

ADVERTISEMENT

అదే చోట ఇప్పుడు టీడీపీ సభ పెట్టి మోడీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పడానికి సిద్ధం అవుతుంది. మరోవైపు అదే సమయంలో పవన్ కళ్యాణ్ చిత్తూరు పర్యటనకు వెళ్తారట.పవన్ నిన్న ప్రధానిని బాలయ్య విమర్శించినందుకు టీడీపీపై విరుచుకుపడిన సంగతి మన అందరికి తెలిసిందే. ఇద్దరూ మోడీని మాట అననివ్వరా? అని టీడీపీ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో ఆ పై వాడికే ఎరుక!

ADVERTISEMENT
Latest Stories