Tadipatri TDP

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఐదేళ్ల నుండి టీడీపీ నాయకుల పైన, వారి అనుచరుల పైన విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు వైసీపీ శ్రేణులు. కక్ష సాధింపుతో పసుపు జెండా పట్టుకున్న ప్రతి వ్యక్తిని వేధించింది జగన్ ప్రభుత్వం.

ఈ ఐదేళ్ల వైసీపీ అణిచివేతతో అల్లాడిన టీడీపీ తమ్ముళ్లు ఈ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ దౌర్జన్యులకు సంయమనం పాటించలేకపోయారు. వైసీపీ నేతల దాడులకు ఎదురొడ్డి ఎక్కడా తగ్గేదెలా అనేలా టీడీపీ నుంచి కూడా అంతే ప్రతిస్పందన కనపరిచారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇరు పార్టీల మధ్య పోలింగ్ రోజు మొదలైన దాడులు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం పై తిరుగుబాటే. ఇన్నాళ్లు అవమానాలను మోనంగా భరించిన టీడీపీ ఇక మోనం వీడింది.

Also Read – అధికారంలో ఉన్నప్పుడే గడప గడపకి వెళ్ళలేదు!

అందులో అనంతపూర్ జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం ఒకటి. గత నాలుగు దశబ్దాలుగా ఇక్కడి రాజకీయాన్ని శాసిస్తున్న జేసీ కుటుంబం టీడీపీ పార్టీలో ఉండడంతో స్థానికంగా ఉన్న వైసీపీ నేత పెద్దా రెడ్డి గత ఐదేళ్లుగా జేసీ కుటుంబం పైన ఆయన అనుచరుల మీద వేధింపులకు పాల్పడి రాజకీయంగా ఆర్థికంగా దెబ్బకొట్టారు. ఇక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూడా తమ రౌడీ మూకతో టీడీపీ జెండా ఎగరకుండా ఆపగలిగారు పెద్దా రెడ్డి.

ఈ సార్వత్రిక ఎన్నికలలో కూడా అదే తరహాలో దాడులు చేసి తెలుగు దేశం కార్యకర్తలను, టీడీపీ మద్దతుదారులను పోలింగ్ కేంద్రాలకు రాకుండా చూడాలి అనుకున్న పెద్దారెడ్డి కి పసుపు జెండా పవర్ చూపించారు తెలుగు తమ్ముళ్లు. తాడిపత్రిలోనే టీడీపీ జెండా ఎగరడానికి వీలులేదు అన్న పెద్దారెడ్డి ఇంటి పైన తెలుగు దేశం జెండా ఎగరేశారు జేసీ అనుచరులు.

Also Read – పవన్‌ విషయంలో జగన్‌ ధోరణిలో మార్పు… ఎందువల్ల?

ఇన్నాళ్ల తమ ఆవేశాన్ని, ఆక్రోదాన్ని పెద్దారెడ్డి ఇంటి ముందు టపాసులు కాల్చి, ఇంటి పైన టీడీపీ జెండా ఎగరేసి చల్లబరుచుకున్నారు జేసీ అనుచరులు. పిల్లినైనా ఇంట్లో పెట్టి కొడితే ఎదో ఒక రోజు ఎదురుతిరుగుతుంది అనే సామెత ఇప్పుడు తాడిపత్రిలో వైసీపీ శ్రేణులకు బాగా తెలిసొచ్చినట్టు ఉంది అంటూ తాడిపత్రిలో ఇక టీడీపీ జెండాకు స్వాతంత్య్రం వచ్చింది అంటూ ఈ వీడియో ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు టీడీపీ, జనసేన మద్దతుదారులు.

అధికారం ఒక్కరికే శాశ్వతం అంటూ విర్ర వీగి అణిచివేతలకు పాల్పడితే దాని నుంచి వచ్చే విస్ఫోటాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదనేది తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు నిరూపించారు. సర్వేల అంచనాలతోనే టీడీపీ శ్రేణులలో ఆత్మ విశ్వాసం కట్టలు తెంచుకుంటుంటే ఇక ఫలితాల తరువాత పరిస్థితి ఎలా ఉండబోతుందో వైసీపీ నాయకుల ఊహకే వదిలి పెట్టాలి.

Also Read – పాపం ఆవిడ ఇంకా ఎన్టీఆర్‌ దగ్గరే ఆగిపోయారు!