గుంతల రోడ్లు, కూలుతున్న వంతెనలు… అయితే అది ఏపీయే!

Penugolanu Bridge Linking Andhra Telangana Collapses

మాజీ సిఎం కేసీఆర్‌ ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రాలో రోడ్ల దుస్థితిని అక్కడి ప్రజలకు తెలియజేస్తూ, “డబుల్ రోడ్ ఉంటే అది తెలంగాణ సింగిల్ రోడ్ మొదలైతే అది ఆంధ్రప్రదేశ్‌,” అని సింపుల్‌గా చెప్పారు. అయితే ఏపీలో రోడ్లు అంతకంటే దారుణమైన పరిస్థితులలోనే ఉన్నాయని టిడిపి, జనసేనలు ఫోటోలు, వీడియోలతో సహా చూపిస్తూనే ఉన్నాయి.

చెవిలో జోరీగలాగ వాటి గోల భరించలేకనో లేదా ఎన్నికలు దగ్గర పడుతున్నాయనో వైసీపి ప్రభుత్వం ఏపీలో రోడ్ల మరమత్తులు చేయించడం మొదలుపెట్టింది. అవి పూర్తయ్యేలోగానే మరో పక్క పాత వంతెనలు కూలిపోతుండటంతో వైసీపి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

ADVERTISEMENT

నాలుగైదు నెలల క్రితమే ఇచ్చాపురంలోని ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలను కలిపే పాత వంతెన కూలిపోయింది. దాంతో పాటు గ్రానైట్ లోడుతో వెళుతున్న ఓ పెద్ద ట్రాక్ కూడా వంతెనపై నుంచి క్రింద పడిపోయింది. ఇంతవరకు దాని స్థానంలో కొత్త వంతెన నిర్మాణం మొదలుపెట్టలేదు. ఆ వంతెనపై రాకపోకలు నిలిచిపోవడంతో వాహనాలు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తోంది.

తాజాగా ఎన్టీఆర్‌ జిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆంధ్రా- తెలంగాణ రాష్ట్రాల మద్య వాహనాలు రాకపోకలు సాగించే వంతెన కూలిపోయింది. నిత్యం ఆ వంతెన మీదుగా ఇసుక లారీలు తిరుగుతుంటాయి.

వంతెన చాలా పాతది కావడంతో ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని కనుక కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు చాలా కాలంగా అధికారులకు, వైసీపి నేతలకు చెపుతూనే ఉన్నారు. కానీ ఉద్యోగుల జీతాల చెల్లింపుకే నిధులు సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతున్న వైసీపి ప్రభుత్వానికి వంతెనలు నిర్మించడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక మళ్ళీ ఎన్నికలలో గెలిపిస్తే తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇస్తుంది. నో డౌట్!

ADVERTISEMENT
Latest Stories