తమిళ తలైవార్ రజనీకాంత్ పేట సినిమా రిలీజ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిన్నటివరకూ పేటకు థియేటర్స్ దొరకలేదు అందుకే ఈ తిప్పలు అన్నీ అని తెలిసిన తరుణంలో ఇప్పుడు మరో టెక్నికల్ చిక్కు ఒకటి వచ్చి పడింది. అయితే అందులో లొసుగులు ఉండడం వల్ల పాపం నిర్మాతలు ఏమీ మాట్లాడలేకపోతున్నారు.
విషయం ఏంటి అంటే టాలీవుడ్ నియమం ప్రకారం పండగ పూట డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చెయ్యకూడదు అన్న నిబంధన ఉంది. అయితే దాన్ని గతంలో బాగానే అమలు చేశారు కానీ కట్ చేస్తే గత రెండు ఏళ్ల నుంచి ఆ నిబంధనని తుంగలో తొక్కారు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే నియమాన్ని బయటకు తీస్తే మాత్రం పేట రిలీజ్ కష్టమే.
అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే, ఆ నియమాన్ని ఇప్పటికిప్పుడు బయటకు తియ్యలేరు…ఎందుకంటే గత రెండు ఏళ్లలో పండగ పూట డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసిన వారిలో బడా నిర్మాతలు ఉన్నారు..వాళ్ళ సేఫ్టీ కోసం అయినా ఈ టెక్నికల్ ఎర్రర్ ని మెల్లగా సైడ్ చేసేస్తారు.
ఏది ఏమైనా తెలుగులో రజని ఫాన్స్ కి పేట సినిమా నిరాశనే మిగులుస్తుంది అన్న భయం బలంగా కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో.



