ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించారు వైసీపీ నేతలు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా అరాచకాలకు పాల్పడుతున్నారు వైసీపీ నేతలు.
ఎన్నికల ప్రచారం వరకు వై నాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించిన వైసీపీ నాయకులు పోలింగ్ రోజు నుంచి మీ పై మాకు నమ్మకం లేదు అన్నట్టుగా ఓటర్లను భయపెట్టడం, పోలింగ్ కేంద్రాలలో దాడులకు పాల్పడడం, టీడీపీ కార్యకర్తల పైన ఆ పార్టీ నాయకుల మీద హత్య ప్రయత్నాలకు పురికొల్పడంతో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
దొంగే దొంగా..దొంగా అని అరిచినట్టుగా వారే దాడులు చేస్తూ, రాళ్లతో, కర్రలతో, గొడ్డళ్లతో మహిళలనే కనికరం కూడా లేకుండా దాడులు చేసిన దృశ్యాలు కళ్ళముందు సాక్ష్యాలుగా కనపడుతున్నా ఇంకా ప్రజలను మభ్య పెట్టడానికి అటు టీడీపీ శ్రేణులను ఇటు పోలీస్ వ్యవస్థను దూషిస్తూ ఏపీని మరో బీహార్ గా మార్చిన వైసీపీ నాయకులకు చెక్ పెట్టడానికి ఈసీ అన్ని ఆయుధాలను సిద్ధం చేసింది.
పోలింగ్ ముగిసి ఇన్ని రోజులు గడుస్తున్నా పల్నాడు, చంద్రగిరి, మాచవరం, సత్తుపల్లి తదితర ప్రాంతాలలో ఇప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. అయితే ఈ దాడులను నియత్రించలేకపోయిన అధికారుల పై చర్యలు తీసుకున్నారు ఈసీ అధికారులు. దీనితో రాష్ట్రానికి మరిన్ని కేంద్ర భద్రతా బలగాలతో పాటు అధికారుల బదిలీ కూడా జరిగింది. ఇక తమ అరాచకాలకు అడ్డుకట్ట పడనుంది అని ముందుగానే గ్రహించిన మాచవరం వైసీపీ నాయకులు పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఈ రోజు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో వైసీపీ అనుచరుల వద్ద 51 పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు, కత్తులు, వేట కొడవళ్లు, గన్నులను పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో అల్లర్లను అరికట్టడానికి 144 సెక్షన్ అమలు చేసారు అధికారులు. దీనితో వైసీపీ నేత పిన్నెల్లి ని హౌస్ అరెస్టు చేసి వారిని నిర్బంధించారు పోలీసులు.
అయితే తమ ప్రాంతంలో ఇంత మొత్తంలో మందుగుండు సామానులు దొరకడంతో ఇక తమ అరెస్టుకు రంగం సిద్దమయ్యింది అని ముందుగానే ఊహించిన పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, వెంకట్రామి రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిద్దరు గన్ మ్యాన్లను విడిచి పెట్టి ఏటో వెళ్లిపోయినట్లు గన్ మాన్లు అధికారులకు తెలియచేసారు. అయితే వైసీపీ నేతలు, వారి అనుచరులు మాత్రం విశ్రాంతి కోసం సేద తీరడానికి పక్క రాష్ట్రమైన తెలంగాణలోని హైద్రాబాద్ కు వెళ్లారని పిన్నెల్లి సోదరులు ఎక్కడికి పారిపోలేదని కవర్ చేయడానికి శ్రమిస్తున్నారు.
అయితే జూన్ 4 కు ముందే ఇలా తట్టా బుట్టా సర్దుకుని సొంత రాష్ట్రమైన ఏపీని విడిచి తాను పోటీలో ఉన్న నియోజకవర్గాన్ని కాదని ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా వెళ్లిపోయిన ఈ పిన్నెల్లి బ్రదర్స్ వెళ్ళింది అజ్ఞాతవాసానికా..? వనవాసానికా..? అనేది తేలాలలంటే మరో 15 రోజులు వేచి ఉండాల్సిందే. గెలిచినా తరువాత అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేయడం కాదు ఓటమి పలకరించినప్పుడు కూడా తనకు ఓటేసిన ప్రజలకు అండగా ఉన్నవాడే నిజమైన రాజకీయ నాయకుడు కాగలడు. ఆ నిజమైన రాజకీయ నాయకులెవరో గత ఐదేళ్ళవుగా ప్రజలు చూస్తూనే ఉన్నారనుకుంటా..!




