మాచర్లలో అల్లర్ల తర్వాత వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని, ఆయన సోదరుడు వెంకట్రామి రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. కానీ వారివురూ పోలీసుల కళ్లెదుటే గన్‌మ్యాన్‌లను వెంట పెట్టుకొని తమ సొంత వాహనాలలో హైదరాబాద్ పారిపోయారు. గృహ నిర్బంధంలో ఉన్నవారు పరారవుతుంటే కాపలా ఉన్న పోలీసులు చూసి చూడన్నట్లు విడిచిపెట్టేసి ఇప్పుడు వారికోసం బృందాలు ఏర్పాటు చేసుకొని గాలింపు మొదలుపెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
Also Read – మంచులో అందరూ మంచివాళ్ళే కానీ…
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి స్వయంగా తాము హైదరాబాద్‌లో ఉన్నామని ఎక్కడికి పారిపోలేదని, సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపిస్తే వచ్చి హాజరవుతామని చెప్పారు. ఒకవేళ పరారీలోనే ఉన్నా, పోలీసులకు లొంగిపొమ్మని జగన్ ఒక్క మాట చెపితే చాలు కదా?
వారిద్దరూ హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నారో వైసీపి నేతలందరికీ తెలుసు. బహుశః పోలీసులకు కూడా తెలిసే ఉంటుంది. కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం గాలిస్తున్నారట! ఆయన దొరికితే అరెస్ట్ చేస్తారట! కానీ అటు ఆయనకి, ఇటు పోలీసులకు జగన్ సైగ చేస్తే కానీ అరెస్ట్ కారనేది అందరికీ తెలిసిన రహస్యమే.
Also Read – ‘గుడ్డి’ ప్రభుత్వానికి…’గుడ్డు’ మంత్రికి…’గూగుల్’ విలువ తెలుసా.?
కానీ అదే… టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఇంట్లో నిద్రపోతుంటే అర్దరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేయగలరు. మాజీ మంత్రి నారాయణ, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు రాజేష్ వంటి వారు హైదరాబాద్‌లో ఉన్నా క్షణాలలో వెతికి పట్టేసుకోగలరు. కానీ పిన్నెల్లి సోదరులు మాచర్ల పోలీస్ స్టేషన్ ఎదురుగానే కుర్చీ వేసుకొని కూర్చున్నా పోలీసులు వారిని కనిపెట్టలేకపోవచ్చు. కనుక అరెస్ట్ చేయలేకపోవచ్చు.
ఆనాడు విజయ్ మాల్యా బ్యాంకులకు రూ.9,000 కోట్లు కుచ్చుటోపీ పెట్టేసి విదేశాలకు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకొని, ఆనక సీబీఐ, ఈడీ బృందాలు లండన్‌లో ఆయనను అరెస్ట్ చేసేందుకు వెతుకుతూ, అక్కడి కోర్టులలో న్యాయపోరాటాలు చేస్తున్నట్లే ఉంది. బహుశః జూన్ 4 వరకు పిన్నెల్లి సోదరులను ఏపీ పోలీసులు కనిపెట్టలేకపోవచ్చు.