‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ‘మాణిక్య మలరయ’ అనే పాటతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ పాట ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ హైదరాబాద్ కు చెందిన ముస్లింలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఈ సినిమా దర్శకుడు ఒమర్ లులుపై, ప్రియపై కేసు పెట్టడం విదితమే. తాజాగా హైదరాబాద్ కే చెందిన కొందరు ముస్లింలు మళ్లీ సుప్రీంకోర్టులోమరో కేసు వేశారు.
‘కన్ను కొట్టడం ఇస్లాం మత సంప్రదాయానికి వ్యతిరేకమని, ఈ సినిమా విడుదలకు అనుమతిచ్చే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని’ తమ పిటిషన్ లో వారు కోరారు. ఈ సినిమాకు సంబంధించిన వేసిన తొలి కేసు విషయమై ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి, తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని కోరగా ఆమెకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. మార్చి 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ కు వాయిదా పడటం తెలిసిందే.



