చీకట్లో బాణం… పవన్ ఫ్యాన్స్ కు తగులుకుంది..!

Pawan Kalyan_ఎవరి గురించి మాట్లాడిందో తెలియదు గానీ, నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపింది. “డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు… మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ… నీ గుణం ఏంటి?” అని ప్రశ్నించింది. ఇటీవలి కాలంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పూనమ్ కౌర్ కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. పూనమ్ ను ఉద్దేశించి కత్తి మహేష్ వ్యక్తిగత విమర్శలు కూడా చేశాడు.

ADVERTISEMENT

ఆమెకు, పవన్ కల్యాణ్ కు మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ నేపథ్యంలో ఎవరి పేరునూ ప్రస్తావించకుండా పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఆమె ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినప్పటికీ, చేసిన వ్యాఖ్యలు తమ హీరోను ఉద్దేశించినవేనని భావిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలతో చెలరేగుతున్నారు.

తనకు అండగా ఉన్న వ్యక్తిపైనే అభాండాలు వేస్తోందని, ఆమెకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అలాగే పూనమ్ నాటకాలు ఆడుతోందని, తరువాతి సినిమాల గురించి ట్వీట్లు వేసుకుంటే బాగుంటుంది గానీ, పేరు చెప్పకుండా ఇలా ఆరోపణలు చేస్తే తగిన శాస్తి జరిగి తీరుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక పూనమ్ టీవీ చానల్స్ కు వెళ్లాలన్న సెటైర్లు కొందరు… పబ్లిసిటీ కోసం కాంట్రవర్శీ సృష్టిస్తోందని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఓవరాల్ గా ఆమె చేసిన వ్యాఖ్యలలో నిజం కూడా ఉందని ఇంకొందరు అంటున్నారు.

అయితే దీనిపై తర్వాత పూనం వివరణ ఇచ్చుకుంది. “నా ట్వీట్ ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించినది కాదు. ఓ బాలిక బాధను ఇలా వ్యక్త పరిచాను. ఓ బాలికను 14 ఏళ్లకే సొంత తండ్రి అమ్మేశాడు. ఆమెకు 24 ఏళ్లు వచ్చేవరకు ఏడేళ్ల బిడ్డ ఉన్నాడు” అని వెల్లడించింది. డబ్బు కోసం కన్న కూతురిని అమ్మిన వ్యక్తుల గురించి ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పింది. ఈ వివరణ తరువాత కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ విమర్శలకు పులుస్టాప్ పడలేదు. ఆమె వివరణ నమ్మశక్యంగా లేదంటూ తాము తిట్టాలనుకున్న తిట్లు తిట్టేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories