మొదటిగా బిజీ అయ్యే హీరోయిన్ కూడా ఆమెనా?

Pooja Hegdeపూజా హెగ్డే ఈ సంవత్సరం అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ యొక్క అల వైకుంఠపురంలో సినిమాతో భారీ హిట్ సాధించింది. కరోనా వైరస్ పాండమిక్ కారణంగా వివిధ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటి అకస్మాత్తుగా ప్రతి ఇతర సినీ సెలబ్రిటీల మాదిరిగా తన ఇంటికే పరిమితం అయిపోయింది. అయితే, ఈ నటి త్వరలో చాలా బిజీగా ఉండబోతోంది.

ADVERTISEMENT

ప్రభాస్ రాధే శ్యామ్ సెప్టెంబర్ రెండవ వారంలో షూటింగ్ ప్రారంభించనున్నారు. లాక్డౌన్ తర్వాత ఇది ఆమెకు మొదటి అసైన్మెంట్ ఇదే అవుతుంది. ఆమె మరో ప్రాజెక్ట్, అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా సంక్రాంతి 2021 స్పెషల్ గా విడుదల చెయ్యబోతున్నాం అని ప్రకటించారు.

డిసెంబర్ చివరి నాటికి సినిమాను పూర్తి చేసే పనిలో భాగంగా ఈ బృందం కూడా త్వరలో షూట్ ప్రారంభించబోతున్నారు. కాబట్టి, ఈ నటి అతి త్వరలో బిజీగా అవ్వబోతుంది. లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండీ పూజా తన ముంబైలోని ఇంటికే పరిమితం అయిపోయింది.

చాలా కాలం తరువాత తీరిగ్గా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేసింది. వచ్చే నెల నుండి ఆమె హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యి ఇక్కడే కొన్ని నెలల పాటు మకాం వెయ్యబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటు పూజా ఇప్పటికే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ఇంకో సినిమాలో నటిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories