
బుట్టబొమ్మ బుట్టబొమ్మా అంటూ తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకున్న పూజ ఆ తరువాత వరుస ప్లాపులతో టాలీవుడ్ కి దూరమయ్యారు. అయితే ఇప్పుడు తమిళ సినిమాతో అటు తమిళ ప్రేక్షకులతో పాటుగా ఇటు తెలుగు వారిని పలకరించబోతున్నారు ఈ జిగేల్ రాణి.
జిల్ జిల్ జిగేలు రాణి అంటూ రంగస్థలం మూవీలో బుచ్చిబాబుతో కలిసి చిందేసిన పూజా చాల కాలం తరువాత మరోసారి స్పెషల్ సాంగ్ లో అలరించబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతున్న ‘కూలీ’ మూవీ లో పూజ హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Also Read – త్రిభాషా…డీలిమిటేషన్ పై పవన్ స్పందన…
దీనితో పాటుగా ఈ సాంగ్ లో పూజ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు చిత్ర బృందం. అయితే ఈ సినిమాలో మరో తెలుగు సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నారు. హీరోయిన్ గా శృతిహాసన్, కీలక పాత్రలలో మరో తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్, కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర కనిపించబోతున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో మూవీలో వచ్చే స్పెషల్ సాంగ్ మీద కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఆ సాంగ్ హిట్ తో వచ్చే క్రెజ్ తో పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలను అందుకుంటున్నారు అందాల ముద్దుగుమ్మలు. పుష్ప – 2 మూవీలో శ్రీలీల ‘కిసక్’ సాంగ్ ఆ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచింది.
Also Read – బెట్టింగ్ రాజాలు…సిద్ధమా.?
దీనితో పుష్ప విజయంతో శ్రీలీల బాలీవుడ్ అవకాశాలను ఈజీగా అందిపుచ్చుకున్నారు. అలాగే గతంలో రజని జైలర్ మూవీ లో కూడా మిల్కీ బ్యూటీ తమన్నా రజనితో ఆడిపాడారు. ఆ సాంగ్ కూడా సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అయ్యి జైలర్ మూవీ ప్రమోషన్స్ కు హెల్ప్ అయ్యింది.
ఇక సుక్కు, చెర్రీ కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీ లో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ పూజ కెరీర్ కి స్పెషల్ క్రెజ్ తీసుకువచ్చింది. అలాగే ఆ మూవీ కూడా సుక్కు, చరణ్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ గా నిలిచింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో పూజ లోకేష్, రజని మూవీ లో మరోసారి తన అందచందాలతో, నాట్యంతో వెండితెర మీద జిగేల్ అనే మెరుపులు మెరిపిస్తారా.?
Also Read – సనాతన మార్గంలో పవన్ ప్రయాణం తమిళనాడుకే
అయితే గత కొన్నేళ్లుగా హిట్లు లేక కెరీర్ ని నెట్టుకొస్తు ఫెడ్ అవుట్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న పూజ ఈ స్పెషల్ సాంగ్ తో మరిన్ని అవకాశాలను అందుకుంటారా.? లేక మిల్కీ బ్యూటీ మాదిరి ఒక్క ఛాన్స్ తో సరిపెట్టుకుంటారో చూడాలి.