అల వైకుంఠపురములో గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన పూజా

Pooja Hegde reveals Ala Vaikunthapurramloo movie storyహప్పెనింగ్ హీరోయిన్ పూజా హెగ్డే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాలో రెండో సారి జతకడుతుంది. గతంలో ఆమె అల్లు అర్జున్ పక్కన డీజేలో నటించింది. ప్రస్తుతం బన్నీ పూజాల మీద ప్యారిస్ లో సామజవరాగమణ పాట తీస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి పూజా ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.

“సినిమాలో నేను బన్నీ ఒకే కంపెనీలో పని చేస్తాం. నేను బన్నీ బాస్ గా ఉంటా. మా ఇద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ అందరినీ నవ్విస్తుంది,” అని ఆమె చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా డిసెంబర్ మొదటి వారం నాటికి మొత్తం షూటింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అనూహ్యమైన రెస్పాన్స్ తో సినిమా మీద అంచనాలు పెంచేశాయి.

ADVERTISEMENT

అల వైకుంఠపురములో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా అదే రోజున విడుదల చేస్తున్నాం అంటూ ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడం విశేషం. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా ఏళ్ల తరువాత టబూ ఈ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలోకి తిరిగి వచ్చింది.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్లుగా నిలవడంతో సంక్రాంతి సినిమాలన్నిటి కంటే ప్రమోషన్స్ లో అల వైకుంఠపురములో ముందు ఉంది.

ADVERTISEMENT
Latest Stories