మీరు మారిపోయారు సార్! మీరు మారిపోయారు అంతే!

Posani Krishna Mural J rNTRరాష్ట్రంలో వైసీపీ నేతల రాజకీయ విమర్శలు పరాకాష్టకు చేరినట్టున్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రతిపక్ష నేత ఆరోగ్యం పై అందరు ఆందోళనలో ఉంటే ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన ప్రభుత్వ అధికారులు, వైసీపీ నేతల విమర్శలు సమాజంలో దిగజారిపోతున్న మానవత్వ విలువలకు అద్దం పట్టేలా ఉన్నాయి.

ADVERTISEMENT

గడిచిన నెలరోజులలో చంద్రబాబు 5 కేజీల బరువుతగ్గారని, ఆయనకు స్కిన్ ఎలర్జీ సోకింతని అయన కుటుంబసభ్యులు బాబు ఆరోగ్యంగా పై ఆందోళన వ్యక్తం చేస్తే బాధ్యత రాహిత్యంగా విలువలకు తిరోధకాలిచ్చినట్టు పలువురు అధికారులు, వైసీపీ నేతలు చేసిన విమర్శలు రాష్ట్రంలో చర్చనీయాంశమైనాయి.

రాష్ట్ర జైళ్ల శాఖా డీజీ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జైలుకు వచ్చాక 5 కేజీల బరువుతగ్గడం కాదు 1 కేజీ బరువు పెరిగారంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. బాబుకి జైళ్లలో దోమలు కుడుతున్నాయి అంటే సహజంగా చెత్త ఉన్న దగ్గరే దోమలుంటాయి, కాబట్టే బాబు దగ్గరకు దోమలు చేరుతున్నాయి అంటూ దిగజారిన విమర్శలు చేస్తున్న వైసీపీ నేత, ఒకప్పుడు ఇదే టీడీపీ బీఫార్మ్ నుంచి గెలిచి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం బాబు డోర్ దగ్గర కాపలా కాసిన విషయం మరిచారేమో మరి!

టీడీపీ నుండి వైసీపీ కి వెళ్లిన చాల మంది నేతలు టీడీపీ లో ఉన్నప్పుడు పక్క పార్టీ నేతలను ఇంతలా దిగజారి, రాజకీయ విలువలకు తిరోధకాలు ఇచ్చే విమర్శలు చేసే వారు కాదు. అక్కడ అటువంటి విమర్శలకు అధిష్టానం అంగీకరించదనో లేక వైసీపీ పార్టీలో నిలదొక్కుకోవాలంటే ఇటువంటి విమర్శలే చెయ్యాలనో మొత్తానికి మీరు మారిపోయారు సార్! అంటూ పలువురు వైసీపీ నేతలను ఉద్దేశించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

అలాంటి వారిలో సినీ రంగంలో క్యారక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమీడియం కమ్ విలన్ పాత్రలు చేసే పోసాని కృష్ణ మురళి కూడా పోటీపడుతుంటారు. జగన్ ప్రాపకం కోసం ప్రతిపక్ష నేతలనే కాదు ఈయన ఏకంగా ప్రజలను.,కులాలను కూడా దూషించడానికి వెనకడుగు వేయరు అని పలు మార్లు రుజువు చేసుకున్నారు కూడా.బాబు అరెస్ట్ పై స్పందిస్తూ చంద్రబాబు జైల్లో ఉండి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని, ఆయన ఎప్పటికి ఈ రాష్ట్రానికి నాయకుడు కాలేడని, చంద్రబాబు ఒక దుర్మార్గుడు అంటూ చేసిన వ్యాఖ్యలు పోసానిలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలను బట్టబయలు చేశాయి.

అక్కడితో ఆగకుండా వైసీపీ ప్రభుత్వం జోలికి వస్తే “జూ.ఎన్టీఆర్ అయినా ఒకటే జూనియర్ ఆర్టిస్టయినా” తమకు ఒక్కటే అంటూ చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకనైనా జూ.ఎన్టీఆర్ పైన వైసీపీ నేతలు ప్రదర్శించే దొంగ ప్రేమను తెలుసుకోవాల్సిన వారు తెలుసుకుంటే మంచిదంటూ పోసానికి వ్యతిరేకంగా “మీరు మారిపోయారు సార్! మీరు మారిపోయారు అంతే!”అంటూ పోస్టులు పెడుతున్నారు.

వైసీపీ నేతల సంస్కారలేమిని సినీ పరిశ్రమ నటులు జీర్ణించుకోలేరని అందుకే బాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ పెద్దలు మౌనం వహించారని ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో పవన్ కుటుంబంపై చివరకు ఆయన పిల్లలను సైతం వదిలిపెట్టకుండా సమాజం సిగ్గుతో తలదించుకునేలా పోసాని చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఆడవారిని సంస్కరించడం అంటే ఇదేనేమో ముఖ్యమంత్రి గారు కాస్త చూసి చెప్పండి! అంటూ సామజిక మాధ్యమాలలో వైసీపీ ప్రభుత్వానికి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. పోసాని రాజకీయ జీవితం మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన పీఆర్పీ పార్టీ నుండి మొదలు పెట్టారు. అప్పట్లో ప్రత్యర్థుల పై ఆయన విమర్శలు రాజకీయానికి మాత్రమే పరిమితమై ఉండేవి. అంతెందుకు 2014 ఎన్నికలలో వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈయనగారు ఈ స్థాయి విమర్శలకు దిగజారలేదు.

అంటే ఇప్పుడు అధికారం తమదే,తాము చెప్పిందే రాజ్యాంగం, తాము చేసిందే చట్టం,అందరు తమ కింద బానిసలై అన్న భావనో ఏమో కానీ తనకు సంబంధం లేని విషయంలోకి చిచ్చుకొచ్చి మరి తనకున్న ‘మెంటల్ కృష్ణ’ పేరుకి పూర్తి న్యాయం చేస్తున్నారు పోసాని. “అహంకారం అందలం ఎక్కితే” దాని పర్యవసానాలు ఇలానే ఉంటాయేమో అనేలా వైసీపీ నేతల పాలన కొనసాగడం దురదృష్టకరం.

ADVERTISEMENT
Latest Stories