ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోని డీల్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం ఒక ప్రాంతపు సెన్సిబిలిటీస్ ని దృష్టిలో పెట్టుకుంటే లాభం లేదు. అందులోనూ సదరు స్టార్ కున్న మార్కెట్ తో పాటు అతని మీద సగటు ప్రేక్షకుల అంచనాల బరువుని కూడా సరిగ్గా తూచగలగాలి. దర్శకుడు ఓం రౌత్ కి మంచి అవకాశం దక్కింది. ఒకరకంగా చెప్పాలంటే జాక్ పాట్.
బడ్జెట్ అయిదు వందల కోట్లు అయ్యిందా లేదనేది తర్వాతి ప్రశ్న. ముందైతే అంతకు మించిన స్టేచర్ ఉన్న ప్రభాస్ చేతికొచ్చినప్పుడు పక్కా ప్లానింగ్ తో ఉండాలి. సోషల్ మీడియాలో ఆదిపురుష్ మీద విపరీత చర్చ జరుగుతోంది. కంటెంట్ ఎలా ఉందనే దానికన్నా విపరీతంగా ఊహించేసుకుని తీవ్రంగా నిరాశపడ్డ ప్రేక్షకుల అసహనం ఆన్ లైన్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
ఒకవేళ రామాయణం కాకుండా ఏదైనా కమర్షియల్ సబ్జెక్టు అయితే ఈ చర్చ వచ్చేది కాదేమో కానీ ఎటొచ్చి దేశమంతా పరమపూజ్యంగా భావించే రాముడి కథ కావడంతో అసహనం ఎక్కువైపోయింది. ఆఖరికి రావణుడి మీద కోపం బదులు జాలి కలిగిందంటే అది ముమ్మాటికీ ఆడియన్స్ ని ఓం రౌత్ తక్కువగా అంచనా వేయడమే . మన స్టార్లను హిందీ డైరెక్టర్లు హ్యాండిల్ చేయలేకపోవడం ఇది కొత్తేమీ కాదు.
ముప్పై ఏళ్ళ క్రితం మహేష్ భట్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు నాగార్జునతో క్రిమినల్, చిరంజీవితో జెంటిల్ మెన్ చేశారు. రెండూ ఆడలేదు. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఓవర్సీస్ బిజినెస్ విపరీతంగా పెరిగింది. ఓటిటి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా మారకుండా కేవలం ప్రభాస్ లాంటి హీరోలతో ఏం చేసినా చెల్లుతుందనే భ్రమలో ఉంటే మాత్రం చేతులు కాలక తప్పదు.
Also Read – సిఎం చంద్రబాబు నాయుడుకి కేశినేని నాని విజ్ఞప్తి
ఆదిపురుష్ బాక్సాఫీస్ లెక్కలు తేలడానికి ఇంకా టైం పడుతుంది కానీ ముందస్తుగా వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఓం రౌత్ ని బోనులో నిలబెట్టేశాయి. రాజమౌళి, సుకుమార్ లు ఉత్తరాది జనాలను మెప్పించగలిగారు కానీ ఓం రౌత్ లాంటి నార్త్ డైరెక్టర్ వాళ్ళ స్వంత ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనే తడబడుతున్నారు. ఒకరకంగా ఈ పరిణామాలు మన హీరోలకు మేలుకొలుపు. గ్రాండియర్లు వందల కోట్ల బడ్జెట్ లతో పాటు సరిగా మెప్పించే కంటెంట్ ఉంటే తప్ప అందరినీ మెప్పించలేమని నేర్చుకోవడానికి.