Prabhas Fansఎన్ని వందల కోట్లతో సినిమా తీసినా ప్రచారం ముఖ్యం. ప్యాన్ ఇండియా హీరో అయినా సరే, కంటెంట్ లో ఎంత క్వాలిటీ ఉన్నా పబ్లిసిటీ చేసుకుని జనానికి చేరువ చేయాల్సిందే. ఆదిపురుష్ సంగీతం విషయంలో టి సిరీస్ అవలంబిస్తున్న తీరు అభిమానులను కొంచెం ఇష్టం కొంచెం కష్టం తరహా ఫీలింగ్ కలిగిస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్బమ్ లో ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఉంటేనే గొప్పనుకోవాలి. అలాంటిది రెండు ఉంటే ఇక చెప్పేముంది. యూట్యూబ్ నుంచి ట్విట్టర్ దాకా వాటి ట్యూన్స్ హోరెత్తిపోవాలి. కానీ జరుగుతున్నది వేరు. జైశ్రీరామ్ ఆడియన్స్ కి విపరీతంగా ఎక్కేసింది. రేవు థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించి కోరస్ లో అందరూ పాడుకునేలా చేసేది ఇదే. జనంలోకి చొచ్చుకుపోయింది.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

హనుమాన్ సేన మీద వచ్చే హుప్పాహుయ్య దీనికే మాత్రం తీసిపోని రీతిలో అజయ్ అతుల్ కంపోజ్ చేశారు. దీనికి పిల్లలు పెద్దలు డాల్బీ సౌండ్ లో ఓ రేంజ్ లో కనెక్ట్ కావడం ఖాయం. రావణుడి థీమ్ సాంగ్ శివోహం, సీతారాముల జోడి గీతం రామ్ సీతారాం కూడా చక్కగా ఉంటూ ఆల్బమ్ మొత్తానికి మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాయి.

విచిత్రం ఏంటంటే అసలు ఫుల్ జ్యుక్ బాక్స్ యూట్యూబ్లో వచ్చిందన్న సంగతే పెద్దగా తెలియకుండా వదిలేశారు. ప్రతిదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేంజ్ లో చేయాల్సిన అవసరం లేదు కానీ, కనీసం సోషల్ మీడియాలో కమింగ్ సూన్ అని, లేదా డేట్ కి కౌంట్ డౌన్ పెట్టడం లాంటివి చేసి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం.

Also Read – ప్రమోషన్స్‌ అంటే ఇలా.. అందరూ చూసి నేర్చుకోండయ్యా!

ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నది ముంబై టీమ్. గతంలో సాహో విషయంలో ఇదే పద్ధతి పాటించారు. తెలుగు మార్కెట్ ఎంత బలమైనది అయినా వాళ్ళ ధోరణి నార్త్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దీన్ని బట్టి ముంబై టీమ్ అంతే అంతే అని అనుకోవడం తప్ప అభిమానులు చేయగలిగింది ఏమీ లేదు. అసలైతే ముందో టెన్షన్ ఉండేది. పాటలు ఎలా ఉంటాయోనని.

ఎందుకంటే లవకుశ, శ్రీరామరాజ్యం, సంపూర్ణ రామాయణం లాంటి రామాయణగాథలు మ్యూజికల్ హిట్స్ గా చరిత్రలో చోటు సంపాదించుకున్నాయి. ఆదిపురుష్ ఆ టెన్షన్ అయితే తీర్చింది. విజువల్ గా చూశాక పాటలు ఇంకా బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రమోషన్ గురించి ముందే చెప్పినట్టు ముంబై వాళ్ళు ఇంతేనని సర్దుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు.

Also Read – ఆవేశంతో యుద్ధం చేస్తే అణు ప్రమాదం.. సిద్దమేనా?