Prabhas fans trolls vijay deverakonda 65వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు అట్టహాసంగా జరుగగా, తెలుగు ఉత్తమ నటుడు విభాగానికి వచ్చేసరికి ఇది విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా ‘బాహుబలి 2’ సినిమాకు గానూ ప్రభాస్ కనపరిచిన అద్వితీయమైన నటనకు ‘ఉత్తమ నటుడు’ అవార్డు ఇవ్వకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ప్రభాస్ స్థానంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు గానూ విజయ్ దేవరకొండకు అవార్డు వరించింది.

Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!

దీంతో తమ నిరసనను వివిధ రకాలుగా తెలియజేస్తోన్న యంగ్ రెబల్ స్టార్ అభిమానులు… ఫోటోలను పెట్టి కాప్షన్స్ ను రాస్తున్నారు. అలాంటి ఓ ఫోటోలలో విజయ్ దేవరకొండ – ప్రభాస్ లతో కూడిన పిక్ హిలేరియస్ గా ఉంది. ‘బాహుబలి 2’ సినిమాలో ప్రభాస్ కు పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో శివగామి, రానాకు పట్టాభిషేకం చేసే సీన్ తెలిసిందే. అయితే ఈ సీన్ లో రానా స్థానంలో విజయ్ దేవరకొండ ఫోటోను పెట్టి సోషల్ మీడియాలోకి వదిలారు.




సినిమాలో నాడు శివగామి ద్రోహం చేస్తే…. నేడు రియల్ గా ఫిల్మ్ ఫేర్ ద్రోహం చేసిందంటూ సదరు పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి నిరసనలకు సోషల్ మీడియాలో కొదవలేదు. ఆ స్థాయిలో ప్రభాస్ అభిమానులు ఫిల్మ్ ఫేర్ ను టార్గెట్ చేసారు. నిజానికి వారి ఆవేదనలో కూడా అర్ధముంది. ఎందుకంటే ‘బాహుబలి 1’లో ప్రభాస్ స్థాయికి తగ్గ నటనను కనపరచలేదు గనుక, ఆ సినిమాను వారు కూడా లైట్ గా తీసుకున్నారు. కానీ ‘బాహుబలి 2’లో ప్రభాస్ అమోఘమైన నటనే సినిమాను మరో మెట్టుపై నిల్చోబెట్టింది.

Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?