prabhas-retire

2017 ఏప్రిల్ నెలలో ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్య కృష్ణ వంటి నటులతో రాజమౌళి తెరక్కెక్కించిన బాహుబలి-2 బాక్స్ ఆఫీస్ వద్ద సునామి నే సృష్టించింది. ఆ తరువాత 7 ఏళ్ళు గడిచినా, ఆ రికార్డు ను ఎవరు ముట్టుకోలేకపోయారు.

Also Read – అమరావతికి రూ. 15వేల కోట్లు… శుభం!

బాహుబలి వల్లే ప్రభాస్ ఉన్నాడు అనేవారందరికి స్వయంగా జక్కన్నే పలు సార్లు సమాధానమిచ్చారు, ప్రభాస్ వల్లే బాహుబలి సాధ్యం అయ్యిందని. కెరీర్ పీక్ సమయంలో ఒక్క సినిమా కే 5 ఏళ్ళు కేటాయించటం అనేది ప్రభాస్ కు తప్ప మరెవరికి సాధ్యం కాదని.

బాహుబలి-2 తరువాత వచ్చిన సాహో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు తెచ్చినప్పటికీ, నార్త్ ప్రజలు ఆదరించినప్పటికీ, టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 350 కోట్ల లక్ష్యం తో వచ్చిన సాహో, మొత్తంగా 420 కోట్లు తెచ్చిపెట్టింది.

Also Read – జగన్‌ చేయాల్సిన ధర్నాలు చాలానే ఉన్నాయి

ఆ తరువత వచ్చిన రాధే శ్యామ్, మొదటి రోజే డిసాస్టర్ టాక్ తెచుకున్నప్పటికీ, టోటల్ రన్ లో సుమారు 140 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. ఇక భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో ప్రభాస్ శ్రీ రాముడి గా వచ్చిన ఆదిపురుష్ రిలీజ్ అవ్వకముందే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది.

అయినప్పటికీ, ప్రభాస్ కటౌట్ ఇంకా స్క్రీన్ ప్రెసెన్స్ తో 380 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. కటౌట్ ఉన్నోడికి కంటెంట్ తో పని లేదు అన్నట్టు వచ్చిన ప్రతి సినిమా, ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్ము లేపుతున్నాయి.ఇక ప్రభాస్ పని అయిపోయింది, కనీసం రిలీజ్ ఐన సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా అవ్వవు అంటూ విమర్శలు మొదలయ్యాయి.

Also Read – ఏపీకి పరిశ్రమలు రావాలంటే ముందు….

అయితే, సలార్-1 తో ప్రభాస్ దద్ధరిల్లిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. కనీసం ప్రమోషన్లు కూడా చెయ్యని సలార్ టీం, బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల సునామి సృష్టించింది. ప్రమోషన్లు నిల్, కలెక్షన్లు ఫుల్ అని.. కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ తో పని లేదు అని నిరూపించింది. సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా చూపించిన్నప్పటికీ, ఫాన్స్ కు ఎక్కడో వెలితి.

అప్పుడు కల్కి లో రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు ఇక వెలుగు వచ్చే సమయం అయిందని, ఫాన్స్ కు నాగ్ అశ్విన్ ట్రైలర్ లోనే ఫుల్ మీల్స్ పెట్టేసాడు. 900 కోట్ల మార్కును ధాటి అతి త్వరలో మేకర్స్ నుండి 1000 కోట్ల పోస్టర్ రెడీ అవుతుందని ఫాన్స్ టాక్. కంటెంట్ కు కటౌట్ మరియు నాగి విజన్ తోడయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ సత్త చాటింది కల్కి.

సరైన హిట్ పడి ఏడేళ్లయినా,తన స్క్రీన్ ప్రెసెన్స్ కు ఫాన్స్ ఇచ్చే ప్రాముఖ్యత ఇసుమైన తగ్గలేదు. పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్, ఆ స్థాయికి వెళ్ళాక కూడా కుసుమంత పొగరు,గర్వం,అహంకారం ప్రదర్శించడం లేదు. ఆ స్థాయికి వెళ్ళాక మాములుగా ఎందరో స్టార్స్ తమ అహంకారాన్ని చూపిస్తుంటారు, బహుశా ఆ తేడా వల్లనే ప్రభాస్ ను అందరు ముద్దుగా ‘డార్లింగ్’ అని పిలుచుకుంటారు.

ఎప్పటికప్పుడు తన రికార్డ్స్ ను తానే బ్రేక్ చేసుకుంటూ ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టిస్తూ ప్రభాస్ ప్రభంజనం కొనసాగుతుంది. దీనితో వాడు ఎక్కడున్నా రాజే రా అన్న డైలాగ్ కు ప్రభాస్ పూర్తి న్యాయం చేస్తున్నారు అంటూ ప్రభాస్ అభిమానులు ముచ్చట పడుతున్నారు.

కల్కి లో రక్షకుడి నుండి,’రాజాసాబ్’ గా అవతారమెత్తనున్నాడు,సందీప్ తో ‘స్పిరిట్’, ప్రశాంత్ తో సలార్-2 , ఇంకా హను రాఘవపూడి తో సైతం ఒక సినిమా లైన్ లో పెట్టినట్టు సమాచారం. టాలీవుడ్ నుంచి రెండు సినిమాలను 1000 కోట్ల క్లబ్ లో చేర్చిన బాస్ ప్రభాస్.