
మంచు విష్ణు మోస్ట్ ఫ్రెస్టేజియస్ మూవీ గా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప లో ఎంతోమంది ఇతర ఇండస్ట్రీ స్టార్స్ ను నటీనటులుగా ఎంపిక చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, తమిళ నటుడు శరత్ కుమార్ ఇలా ఎంతోమంది సీనియర్ స్టార్స్ కన్నప్ప మూవీలో నటించబోతున్నారు.
అలాగే సీనియర్ యాక్ట్రెస్ మధుబాల, టాలీవుడ్ చందమామ కాజల్, మహాభారతం సీరియల్ లో దుర్యోధనుడిగా మెప్పించిన అర్పిత్ రంక, విలక్షణ నటుడు, విష్ణు తండ్రి మోహన్ బాబు, ఇక పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ రాజు ప్రభాస్ కూడా ఈ మూవీ లో మెరబోతున్నారు. అయితే కన్నప్పలో ప్రభాస్ ఒక ప్రత్యేక పాత్రలో స్పెషల్ గెస్ట్ గా కనువిందు చేయనున్నారు.
Also Read – అయ్యో పాపం వైసీపీలు… చెవిలో ఎలా పూలు పెట్టేస్తున్నాడో!
అయితే అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇలా సాదా సీదాగా బయటకు విడుదల చేసింది చిత్ర యూనిట్. రుద్రగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఎటువంటి ప్రచార ఆర్భాటాలకు తావియ్యకుండా విడుదల చేసినప్పటికీ ఆ లుక్ లో ప్రభాస్ చాల భిన్నంగా కనిపించారు. ఆదిపురుష్ డిజాస్టర్ తరువాత మరోసారి మైతాలజీ మూవీలో నటిస్తున్న ప్రభాస్ తన ఇమేజ్ తో విష్ణు కన్నప్పకు అదనపు ఆకర్షణగా నిలవబోతున్నారు.
ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ రుద్ర పోస్టర్ ను డిజైన్ చేసిన చిత్ర బృందం, పొడవాటి జుట్టు, కాషాయం, రుద్రాక్షలు, విభూది ధరించిన వాడిగా రుద్రను ప్రేక్షకులకు పరిచయం చేసారు. అయితే గతంలో విడుదల చేసిన కన్నప్ప టీజర్ మీద అనేక విమర్శలు ఎదురైనా ఈ తరుణంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆ విమర్శలకు చెక్ పెడుతుందా.?
Also Read – బొత్సగారు.. మీ అనుభవమే వృధా అవుతోంది!
అలాగే గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోలేకపోయిన మంచు వారి కుటుంబానికి ఈ కన్నప్ప సక్సెస్ అత్యంత కీలకం కానుంది. దీనితో బడ్జెట్ ను పక్కన పెట్టిమరి పలు ఇండస్ట్రీ ప్రముఖలను తమ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే ప్రభాస్ ‘రుద్ర’ విష్ణు ‘కన్నప్ప’కు అభయం ఇవ్వగలరా.? లేదా అనేది ఈ ఫిబ్రవరి 25 న తేలనుంది.