Prashant Kishor Jagan Chandrababu Naidu

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి స్వీట్లు పంచుకొని పైశాచికానందం అనుభవించిన ‘వైసీపీలు’ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో గగ్గోలు పెడుతుండటం చూసి నవ్వొస్తుంది.

టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేసినా మాకేం భయం లేదు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే రోజూ వాటిపై పడి ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ టిడిపి కోసం పనిచేసినా టిడిపికి ఒరిగేదేమీ ఉండదు. మాకు తరిగెదేమీ ఉండదంటూ వైసీపీలు చెప్పుకోవడం కూడా మేకపోతు గాంభీర్యమే.

Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..

తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి ఆందోళనతో ‘నువ్వే మా నమ్మకం… నువ్వే మా భవిష్యత్‌’ అని చెప్పుకు తిరుగుతున్న తన ఎమ్మెల్యేలను మార్చేసుకొంటున్నప్పుడే జగన్మోహన్‌ రెడ్డి సగం ఓడిపోయారు. సొంత ఎమ్మెల్యేలను నమ్మలేనని, ఎన్నికలలో విజయం సాధించలేమని చెప్పేసుకొన్నారు.

ఓటమి భయంతో జగన్‌, మళ్ళీ టికెట్స్ రావని వైసీపి ఎమ్మెల్యేలు చెరోవిదంగా భయపడుతూ తీవ్ర అభద్రతాభావంతో ఉన్నట్లు అర్దమవుతూనే ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ప్రశాంత్ కిషోర్‌-చంద్రబాబు నాయుడుతో భేటీ అవడంతో సహజంగానే ఆ భయం ఇంకా రెట్టింపు అవుతుంది.

Also Read – విద్యార్థుల ఆత్మహత్యలు…పాపం ఎవరిదీ.?

ఎందుకంటే గత ఎన్నికలలో తమను గెలిపించిన ప్రశాంత్ కిషోర్‌, ఇప్పుడు చంద్రబాబు నాయుడువైపు నిలిస్తే నూటికి నూరు శాతం ఓటమి తప్పదని వైసిపీలకు తెలుసు. కనుకనే ఇంతగా గగ్గోలుపెడుతున్నారు.

ఆనాడు చంద్రబాబు నాయుడుని గద్దె దించడానికి తెరవెనుక తాము వ్యూహాల పేరుతో ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేశామో వైసీపిలు ఆనాడే మరిచిపోయారు. కానీ ఆనాడు చంద్రబాబు వ్యతిరేక శక్తులన్నీ ఏకమయిన్నట్లే, ఇప్పుడు జగన్‌ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అవుతున్నాయని వైసీపీలు బాగానే గుర్తిస్తున్నాయి. అందుకే ఈ గగ్గోలు.

Also Read – పవన్ కోసం దర్శక నిర్మాతల ఎదురుచూపులు

2019 ఎన్నికల సమయంలో టిడిపికి ఎటువంటి రాజకీయ వాతావరణం ఏర్పడిందో, ఇప్పుడు 2024 ఎన్నికల సమయంలో వైసీపికి కూడా సరిగ్గా అటువంటి వ్యతిరేక రాజకీయ వాతావరణం, పరిస్థితులే ఏర్పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రశాంత్ కిషోర్‌ టిడిపి కోసం పనిచేస్తారో లేదో ఇంకా తెలుసుకోకుండానే ఆయన గురించి వైసీపీలన్నీ నోటికి వచ్చిన్నట్లు వాగేసాయి. తద్వారా రేపు ‘ఐ-ప్యాక్’కి కూడా ఇదే రకమైన ట్రీట్‌మెంట్ లభిస్తుందని ‘హింట్’ ఇచ్చేశారు. కనుక ఐ-ప్యాక్ కూడా వైసీపికి గుడ్ బై చెప్పేయవచ్చు లేదా అదే వైసీపికి శల్యసారధ్యం చేస్తూ అదే జగన్‌ను గద్దె దించినా ఆశ్చర్యం లేదు.




చివరిగా ఓ మాట: అయినా 175 సీట్లు మేమే గెలుచుకొంటామనే వైసీపీలకు నిజంగా ధీమా ఉంటే ఇలా ప్రతీ దానికి ఉలిక్కిపడరు కదా?