‘చిన్నారి పెళ్ళికూతురు’ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యలో నిందితుడిగా పరిగణిస్తున్న ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తమను బెదిరిస్తున్నాడని ప్రత్యూష తల్లి సోమా బెనర్జీ ఆరోపణలు చేసారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బంగూర్ నగర్ పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదని, రాహుల్ రాజ్ సింగ్ సాక్షులను ప్రభావితం చేసేలా స్వేచ్ఛగా వదిలేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు.
‘తమకు న్యాయం జరగాలంటే ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులతో దర్యాప్తు చేయించాలని’ ప్రత్యూష తల్లి ఈ లేఖలో డిమాండ్ చేశారు. రాహుల్ తమ కుమార్తెను మోసం చేయడమే కాకుండా ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని, తమ కుమార్తె లాగే మరికొందరు యువతులను మోసం చేశాడని తీవ్రంగా మండిపడ్డారు. తమతో పాటు ఇతర సాక్షులను కూడా రాహుల్ బెదిరిస్తున్నాడని ఈ లేఖలో పేర్కొన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



