ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రయాణం వెనుక మతలబేంటి?

Naga Vamsi Sithara Entertainmentsఒకప్పుడు అంటే బ్లాక్ అండ్ వైట్ కాలంలో నిర్మాతలు, పంపిణీదారులు వేర్వేరుగా ఉండేవారు. ఎగ్జిబిటర్లతో లావాదేవీలకు ప్రొడ్యూసర్లు దూరం. నిర్మాణంతో పాటు ఆ ఒత్తిడిని తట్టుకోలేమనే ఉద్దేశంతో ఈ ఇద్దరి మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉండేది. కాలక్రమేణా వచ్చిన మార్పులకు అనుగుణంగా సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలు రెండు పడవల మీద ప్రయాణం లాభసాటని గుర్తించారు.

వాళ్ళు మొదలుపెట్టి సాధించిన విజయాలు ఇతరులకు స్ఫూర్తినిచ్చాయి. దీంతో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రెండూ ఒకే గొడుగు కిందకు వచ్చి చేరాయి. తాజాగా ఈ లిస్టులో సితార ఎంటర్ టైన్మెంట్ తోడయ్యింది. నాగవంశీ నిర్మాత అయినప్పటికీ దీనికి త్రివిక్రమ్, చినబాబు అందండలు అందరికీ తెలిసిన విషయమే. మహేష్ బాబు నుంచి విశ్వక్ సేన్ దాకా ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ మీదున్నాయి.

ADVERTISEMENT

తోట నిండా పళ్ళు, తోలడానికి లారీ, దానికో డ్రైవర్ ఉన్నప్పుడు సరుకు బయట వాళ్లకు కమీషన్ మీద అమ్మడం ఎందుకు. అదేదో మనమే చేసుకుంటే వాహనం అద్దె, తోలినోడికి జీతం ఖర్చు పోను అంతా లాభమే వస్తుంది. సరిగ్గా ఈ పాయింటే నిర్మాతలను డిస్ట్రిబ్యూషన్ వైపు లాగుతోంది. అందుకే మైత్రి మూవీ మేకర్స్ ఆలస్యమైనా ఈ ఏడాది ప్రారంభం నుంచే ఆఫీస్ తెరిచి యాక్టివ్ అయ్యింది.

రాబోయే రోజుల్లో సితార వద్ద చాలా క్రేజీ కాంబినేషన్లు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ల డేట్లు, దర్శకులకు అడ్వాన్సులు జరిగిపోయాయి. మరోవైపు ఇతరులు తీసిన కంటెంట్ బాగున్న చిన్న సినిమాలు బయ్యర్లు దొరక్క కిందా మీదా పడుతున్నాయి. అలాంటి వాటికి చేయూతనివ్వడం ద్వారా బ్యానర్ కు పేరుతో మార్కెట్ లో క్రెడిబిలిటీ పెరుగుతుంది. మసూద విషయంలో దిల్ రాజు చేసింది ఇదే.

ఏషియన్, ఎస్విసి లాంటివి డిస్ట్రిబ్యూషన్ వైపు నుంచి ప్రొడక్షన్ కు వచ్చాయి. మైత్రి, సితారలది రివర్స్ రూటు. ఈ రెండు స్ట్రాటజీల్లోనూ ఎక్కువ డబ్బు మూడో పార్టీకి వెళ్లదు. సంస్థాగతంగా కేవలం పంపిణిని మాత్రమే నమ్ముకున్న వ్యాపారులు క్రమంగా తెరమరుగైపోతారు. ఇది ఒక కోణంలో నష్టమే కానీ నిర్మాత యాంగిల్ లో చూసుకుంటే అంతకంతా పెరుగుతున్న బడ్జెట్ లు, రెమ్యునరేషన్లు, పబ్లిసిటీ వ్యయాలు ఇన్ని భరించాలంటే బిజినెస్ ని విస్తరించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే బడా సంస్థలకిది తప్పని రూటు.

ADVERTISEMENT
Latest Stories