“పుష్ప 2” బెనిఫిట్ షోస్ ప్రకటించిన నాటి నుండి నేటి వరకు ఏదొక రూపేణా నిరంతరం వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ లో సాధిస్తోన్న కలెక్షన్స్ రికార్డుల నుండి హీరో అల్లు అర్జున్ ద్వారా తలెత్తిన వివాదం వరకు పుష్ప రాజ్ హడావుడి మీడియా వర్గాల్లో నడుస్తూనే ఉంది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఓ సినిమా టికెట్ ధరను 1200 రూపాయలకు పైబడి ప్రకటించి అందరిని అవాక్కు చేసింది చిత్ర యూనిట్.
డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి 1 గంటల నుండి 2 గంటల లోపున ప్రదర్శించిన బెనిఫిట్ షోలకు “పుష్ప 2” టికెట్ ధర సరాసరిగా 1000 రూపాయలు పైనే! అత్యధికంగా 1200 కాగా, తక్కువలో తక్కువగా 800 రూపాయలను అధికారికంగా వసూలు చేసారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో టికెట్ ధరను ప్రకటించడంలో ఉన్న లాజిక్ ను ‘బన్నీ వాస్ అండ్ కో’ చెప్పుకొచ్చారు.
Also Read – జగన్ లండన్‌లో.. బాబు దావోస్‌లో
గతంలో బెనిఫిట్ షోలు 1 గంటకు వేయనప్పటికీ, తెల్లవారుజామున 4-5 గంటలకు వేసేవారమని, అప్పుడు కౌంటర్ టికెట్ ధర 100 రూపాయలు ఉన్నా, బ్లాకులో 1000 రూపాయలు పైనే ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందేనని, ఇలా అధికారికంగా చేయడం వలన కనీసం ప్రభుత్వాలకు టాక్స్ రూపేణా డబ్బులైనా వస్తాయని లాజిక్ ని చెప్పుకొచ్చారు బన్నీ వాస్ అండ్ కో.
ఒక్క బెనిఫిట్ షోలకు మాత్రమే ఆ టికెట్ ధరలు ఉన్నాయని, తెల్లవారుజామున ప్రదర్శించిన షోలకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్న టికెట్ ధరలకే ప్రదర్శించామని, బెనిఫిట్ షోలకు సాధారణంగా అభిమానులే వస్తారని, వాళ్ళు 1000 రూపాయలు ఖర్చు చేయడం అనేది, ఇప్పటి సంగతి కాదని, గత కొన్ని దశాబ్దాలుగా ఫ్యాన్స్ మొదటి షో చూసేయడానికి ఖర్చు చేసేదేనని అన్నారు.
Also Read – డామిట్! పోర్టు పోయింది… ఈడీ కేసు మిగిలింది!
స్వయంగా తానే కృష్ణాజిల్లాను పంపిణీ చేసానని, ముందుగా ఒకటి, రెండు బెనిఫిట్ షోలకు మాత్రమే టికెట్లు ఇచ్చామని, ఆ తర్వాత ఏర్పడిన డిమాండ్ రీత్యా తమ ఆధ్వర్యంలో ఉన్న 16 థియేటర్లలో 8 థియేటర్లలో బెనిఫిట్ షోలను ప్రదర్శించామని “పుష్ప 2” సినిమా యొక్క క్రేజీ టికెట్ ధర విశేషాలను బన్నీ వాస్ చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఏర్పడిన పరిమాణాలతో ఇదే ట్రెండ్ ను ‘గేమ్ చేంజర్’ కొనసాగిస్తుందా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు.