తొలి మూడు రోజులు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన “పుష్ప” సినిమాకు ‘మండే టెస్ట్’ కాస్త ఆందోళనకరంగా మారింది. పూర్తి స్థాయిలో కలెక్షన్స్ డ్రాప్ అవ్వలేదు గానీ, ఈ సినిమా కొనుగోలు కోసం పెట్టిన పెట్టుబడి రికవరీ అవుతుందా? లేదా? అన్నది పంపిణీదారులలో రేపుతోన్న గుబులు.
ఏపీ మరియు ఓవర్సీస్ లో రికవరీ రేటు ప్రస్తుతానికి 50 శాతం దాటగా, సినిమాకు లభించిన టాక్ మరియు ఈ వీకెండ్ లో వస్తోన్న “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో “పుష్ప”కు భారీ స్థాయిలో ప్రమాదం పొంచి ఉంది. కలెక్షన్స్ పరంగా కోలుకోవాలంటే ‘పుష్ప’ సెకండ్ వీకెండ్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ ను అంది పుచ్చుకోవాలి.
కానీ ఈ శుక్రవారం నాని సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. బహుశా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే సినిమాగా “శ్యామ్ సింగ రాయ్” రికార్డులు అందుకోబోతుందన్న టాక్ ట్రేడ్ వర్గాలలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఏపీ, తెలంగాణాలలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా నాని సినిమా అత్యధిక స్క్రీన్స్ లో ప్రదర్శితం కాబోతోంది.
అంటే ‘పుష్ప’ స్క్రీన్స్ సంఖ్య తగ్గడంతో పాటు ప్రేక్షకులు కూడా సహజంగానే కొత్త సినిమా వైపుకు మొగ్గు చూపుతారు. ఒకవేళ నాని సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ లభిస్తే, ‘పుష్ప’ రికవరీ అనేది మరింత డేంజర్ లో పడే అంశం. ‘శ్యామ్ సింగ రాయ్’ ధియేటిరికల్ ట్రైలర్ కు లభించిన పాజిటివ్ రెస్పాన్స్ మరియు సినిమాను ప్రమోట్ చేస్తున్న వైనం నాని సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “పుష్ప” సక్సెస్ వేడుకలను నేడు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో వైభవంగా జరపబోతోంది చిత్ర యూనిట్. కానీ ఏపీలో ఉన్న టికెట్ ధరల రీత్యా సినిమా పరిస్థితి దయనీయంగా ఉంది. రికవరీ విషయంలో టికెట్ ధరల ప్రభావం పెద్ద ఎత్తున కనపడుతుండడం పెద్ద సినిమాలకు ఏపీలో డేంజర్ బెల్స్ ను మ్రోగిస్తోంది.



