రాజధానికి కొత్త అర్ధం చెప్పిన జగన్…

Jagan Mavigan Plan

రాష్ట్ర రాజధాని అంటే అభివృద్ధి, నిర్మాణాలు, ఉపాధి, సంపద సృష్టి, రాష్ట్ర భవిష్యత్, రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం, గుర్తింపు అని ఇలా చాలానే అర్ధాలున్నప్పటికీ జగన్ మాత్రం వాటన్నిటికీ పూర్తి భిన్నంగా రాజధాని అంటే ఒక ఫోర్ట్, ఒక రైల్వే స్టేషన్, ఒక విమానాశ్రయం, హైవే రహదాలు అంటూ ఒక కొత్త అర్ధాన్ని కనిపెట్టారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత లభించిన నాటి నుంచి అమరావతి కి ప్రత్యామ్నాయంగా ఎదో ఒక ప్రకటన చెయ్యాలనే ఉద్దేశంతోనే వైసీపీ మావిగన్ అంటూ ప్రకటించిందా అంటూ ఇన్నాళ్లు అటు అధికార పార్టీ ఇటు సామాన్య ప్రజానీకం భావించారు.

ADVERTISEMENT

కానీ జగన్ మావిగన్ ప్రకటన వెనుక 2029 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఉందన్న సంగతి నేడు జగన్ తన ప్రెస్ మీట్ లో స్ఫష్టం చేసారు. ఏపీ 2029 లో జరగబోయే ఎన్నికలు కూటమి vs వైసీపీ కాదని అమరావతి vs మావిగన్ అంటూ జగన్ కుండబద్దలు కట్టారు.

అయితే తన ఈ వాదనను బలపరుచుకోవడానికి గాను రాజధాని అర్ధాన్ని ఇలా వర్ణించారు జగన్. మచిలీపట్నంలో ఫోర్ట్ ఉంది, విజయవాడలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఉంది, గుంటూరు కనెక్టివిటీ కి హై వే రహదాలున్నాయి….ఇవి చాలవా రాజధానికి అంటూ రాజధానిని ఒక రాజకీయ అంశంగా మార్చేశారు జగన్.

రాజధానిగా మావిగన్ ఉంటే ఇక కొత్తగా రాజధాని కోసం ఖర్చు చెయ్యాల్సిన అవసరం లేదని, ఏవో రెండు మూడు బిల్డింగ్లు నిర్మిస్తే సరిపోతుందిగా అంటూ ఒక రాష్ట్ర రాజధానిని రెండు మూడు బిల్డింగుల నిర్మాణంతో సరిపోల్చేసారు జగన్.

రాజధాని మీద ఇంత స్పష్టత ఉన్న జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కనీసం ఎక్క ప్రాంతంలో అయినా రోడ్ల మరమత్తులు చేసారా.? ఫోర్టులు నిర్మించారా.? విమానాశ్రయాలు కట్టారా.? వైసీపీ హయాంలో విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి ఒక్క ఇటుక అయినా వేసారా.?

కేవలం ప్యాలస్ లో కూర్చుకుని బటన్లు నొక్కడం మాత్రమే పాలన అనుకునే జగన్ రాజధాని గురించి ఇంతకన్నా ఎక్కువగా ఆలోచిస్తారు అనుకోవడం అవివేకమే అవుతుందేమో బహుశా..! జగన్ మాదిరే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు కూడా ఆలోచిస్తే నేడు భారదేశంలో ఒక బెంగుళూర్, చెన్నై, హైద్రాబాద్, ముంబై వంటి మహానగరాలు రూపుదిద్దుకునేవేనా.?

ADVERTISEMENT
Latest Stories