Raghu-Rama-Krishna-Raju-MP

టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీలు తమ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాలని ప్రకటించినప్పటికీ నర్సాపురం ఎంపీ సీటు విషయంలో ఇంకా టిడిపి, బీజేపీల మద్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కడంతో శ్రీనివాస వర్మని అభ్యర్ధిగా ప్రకటించగా, ఏలూరు టిడిపి ఎంపీ అభ్యర్ధిగా పుట్టా మహేష్ యాదవ్‌ని ప్రకటించింది. దీంతో నర్సాపురం సీటుని ఆశిస్తున్న రఘురామ కృష్ణరాజు తీవ్ర నిరాశతో మాట్లాడారు.

Also Read – అమరావతి గురించి చింతించలేదు కాని ప్యాలస్‌ ముఖ్యమా?

కానీ ఆయనను వదులుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడని చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానంతో నర్సాపురం సీటు గురించి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించిన్నట్లు తెలుస్తోంది. నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లని బీజేపీ, టిడిపిలు పరస్పరం మార్చుకోవడానికి అంగీకరించిన్నట్లు తెలుస్తోంది.

కనుక రఘురామ కృష్ణరాజుని టిడిపిలో చేర్చుకొని నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించబోతున్నట్లు తాజా సమాచారం.

Also Read – మేమూ డైరీలు రాసుకుంటున్నామోచ్!

ఏలూరు నుంచి బీజేపీ అభ్యర్ధిగా గారపాటి తపనా చౌదరి పేరుని ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. ఊహించని విదంగా వీరిరువురూ టికెట్స్ పొందబోతుంటే, శ్రీనివాస వర్మ, పుట్టా మహేష్ యాదవ్‌ ఇద్దరికీ టికెట్స్ చేతికి అందిన్నట్లే అంది చేజారిపోతున్నాయి.

ఈ సీట్లు, అభ్యర్ధుల మార్పు గురించి టిడిపి, బీజేపీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ రఘురామ కృష్ణరాజు తన అభిమానులతో కలిసి ఊరేగింపుగా నర్సాపురం వెళుతున్న వీడియో అప్పుడే సోషల్ మీడియాలోకి వచ్చేసినందున ఈ మార్పు ఖాయమే అని భావించవచ్చు.

Also Read – వైసీపీ తెగేదాకా లాగుతుందా.?

తనకు నర్సాపురం టికెట్‌ దక్కకుండా చేసేందుకు జగన్మోహన్‌ రెడ్డి బీజేపీలోని కొందరు మిత్రుల ద్వారా చక్రం తిప్పారని రఘురామ కృష్ణరాజు స్వయంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు కూడా చక్రం తిప్పి ఆ సీటుని టిడిపికి బదలాయించుకొని దానిని రఘురామ కృష్ణరాజుకే అప్పగించబోతుండటం జగన్‌ జీర్ణించుకోవడం కష్టమే.

రఘురామ కృష్ణరాజు నర్సాపురం నుంచి టిడిపి అభ్యర్ధిగా ప్రకటించగానే సగం విజయం సాధించిన్నట్లే. ఆయనకు తన నియోజకవర్గంపై పూర్తి పట్టుంది. పైగా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. కనుక ఎన్నికలలో అవలీలగా భారీ మెజార్టీతో గెలువగలరు. నర్సాపురంలో శ్రీనివాస వర్మని అవలీలగా ఓడించి ఆ సీటుని తన పార్టీ ఖాతాలో వేసుకోవచ్చని జగన్‌ భావిస్తే, ఇంతకాలం ఆయన ఎవరినైతే ద్వేషించారో ఇప్పుడు అదే రఘురామ కృష్ణరాజుని ఎదుర్కోవలసి రావడం దేవుడి స్క్రిప్టే… కదా?