పాండిచ్చేరి సీఎంను కాదు సోనియా గాంధీని తీసుకురండి రఘువీరా గారూ!

N-raghuveera-reddyధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోలవరం మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఏపీకి చెందిన కాంగ్రెస్‌ అగ్రనాయకులు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభకు పాండిచ్చేరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నారాయణస్వామిని ముఖ్యఅతిథిగా తీసుకొచ్చి చంద్రబాబుపై విమర్శలు చేసారు.

ADVERTISEMENT

ఏపీలో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ ను తిరిగి బ్రతికించే ప్రయత్నం చేస్తున్న రఘువీరా రెడ్డి ఇలాంటివి ఎన్ని చేసిన రాష్ట్రం పడుతున్న కష్టాలకు కారణమైన ఆ పార్టీని ప్రజలు క్షమిస్తారా అనేది అనుమానమే. పాండిచ్చేరి సీఎంను కాదు సోనియా గాంధీని తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తే ఏమన్నా కనికరిస్తారేమో.

నాలుగు రోజుల్లో 47 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఈ నెల పదో తేదీన పోలవరంలో సామూహిక సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు వరకు 12.4 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.

ADVERTISEMENT
Latest Stories