ఇటీవలే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ తెలంగాణాలో పార్టీని పటిష్ట పరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకున్నాక మరింత మంది నాయకుల మీద దృష్టి పెట్టారు. బీజేపీ అసంతృప్త నాయకుడు నాగం జనార్ధన రెడ్డిని ఉత్తమ కుమార్ రెడ్డి ఇటీవలే ఢిల్లీ తీసుకుని వెళ్ళినట్టు సమాచారం.
వచ్చే ఎన్నికలలో నాగర్ కర్నూల్ సీట్ ఇస్తే గనుక నాగం పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరో వైపు తెలంగాణ తెలుగు దేశం పార్టీ నుండి కొత్తకోట దయాకర రెడ్డి మరియు సీత దంపతులు కూడా త్వరలో ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలవనున్నట్లు సమాచారం. దేవరకద్ర, ముక్తాల్ సీట్లు ఇస్తే గనుక వారు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఏఐసీసీ ఎస్సీ అధ్యక్షుడు కొప్పుల రాజు ఈ వలసలను సమన్వయం చేస్తున్నట్టు సమాచారం. 2019లో కాంగ్రెస్ పదవిలోకి రావాలంటే తెలంగాణాలో అధికారంలోకి రావడం చాలా అవసరమని కాంగ్రెస్ భావిస్తుంది. కర్ణాటక తరువాత దక్షిణాదిన కాంగ్రెస్ బలంగా ఉంది తెలంగాణలోనే అని పార్టీ భావన.



