విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి” సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో, ఈ సినిమాలకు సంబంధించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చిన విషయం తెలిసిందే. ‘పెళ్లిచూపులు’లో కమెడియన్ గా చేసిన ప్రియదర్శన్ ఏకంగా మహేష్ సినిమా “స్పైడర్”లో మహేష్ పక్కన ఫుల్ లెంగ్త్ రోల్ ఛాన్స్ కొట్టేయగా, తాజాగా మరో కమెడియన్ వంతు వచ్చింది.
అవును… ‘పెళ్లిచూపులు’ సినిమాలో కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ప్రియదర్శన్ మాదిరే, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో స్నేహితుడిగా నటించి, కమెడియన్ గా గుర్తింపు పొందిన రాహుల్ రామకృష్ణకు ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం “భరత్ అనే నేను” సినిమాలో కీలక రోల్ లభించినట్లుగా తెలుస్తోంది. ఇలా వరుసగా విజయ్ దేవరకొండ సినిమాల్లో కమెడియన్స్ కు మహేష్ చిత్రాల్లో అవకాశాలు లభిస్తుండడంతో… విజయ్ తో సినిమా చేస్తే… నెక్స్ట్ మహేష్ బాబు సినిమానే అన్న టాక్ హల్చల్ చేస్తోంది.


